ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడేందుకు ఒకే ఒక్క సొల్యూషన్ లాక్ డౌన్. ఆల్రెడీ వైరస్ సోకిన వారికి ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు డాక్టర్ల వద్ద ఉన్న ఒకే ఒక్క ఉపాయం హైడ్రాక్సిక్లోరోక్విన్. మలేరియాకు వాడే మందును కరోనా చికిత్సలో వాడుతున్నారు. అమెరికాలో వేలాది మంది వైరస్ బారిన పడుతుంటే సాయం కోసం ట్రంప్ భారత్ ను శరణుకోరారు. ఆ డ్రగ్ తమ దేశానికి ఎగుమతి చేయాలని అడిగారు.
ఒకవేళ ఇవ్వకపోతే భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామనే కోణంలో మాట్లాడారు. దీనిపై విదేశాంగ శాఖ నుంచి అనురాగ్ శ్రీవాస్తవ.. అంతర్జాతీయ సంబంధాలు కొనసాగించేందుకు భారత్ ఎప్పుడూ ముందుంటుంది. దృఢమైన సహకారం అందిస్తుందని అన్నారు.
మహమ్మారిపై పోరాడుతున్న తరుణంలో మానవతా దృక్పథంతో ఆలోచించి భారత్ పారాసిటమాల్, హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను ఎగుమతి చేయాలనుకుంటుంది. అది కూడా వైరస్ కారణంగా బాగా దెబ్బతిన్న దేశాలకు సాయం చేయాలనుకుంటుంది. మా సామర్థ్యాలపై ఆధారపడిన వారికి మాత్రమే సరఫరా చేస్తాం. ఈ ప్రయత్నాన్ని ఎటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం వాడదలచుకోలేదు’ అని శ్రీవాస్తవ అన్నారు.
సోమవారం ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఎగుమతి చేయకపోతే ప్రతీకారం కచ్చితంగా తీర్చుకుంటామని మాట్లాడారు. యాంటీ మలేరియా డ్రగ్‌తో ట్రీట్‌మెంట్ అందించవచ్చు. రెండు వారాల నుంచి భారత్ అమెరికాకు ఈ డ్రగ్ ను ఎగుమతి చేయడం ఆపేసింది. భారత్ లో ఉన్న పరిస్థితులు, కరోనా రోగులకు అవసరమవుతుందనే మన దగ్గరే నిల్వ ఉంచింది.