Winter flu jab could protect against coronavirus చలికాలంలో కరోనా ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని, కనుక ముందు ముందు మరింత అప్రమత్తంగా ఉండాలని కొద్దిరోజులుగా సైంటిస్టులు సూచిస్తున్న విషయం తెలిసిందే. శీతాకాలంలో సహజంగానే ఉష్ణోగ్రతలు తగ్గుతాయిని, 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉందంటే అది కరోనా వంటి వైరస్‌లకు ఎంతో అనుకూలమైన టెంపరేచర్ అని సైంటిస్టులు అంటున్నారు. చలికాలంలో సూర్య రశ్మి నుంచి అతినీలలోహిత (అల్ట్రా వయొలెట్) కిరణాల ప్రభావం కూడా తక్కువగానే ఉంటుందని, కనుక కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించరాదని, ఇప్పటి కన్నా మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు అంటున్నారు.
సాధారణంగా శీతాకాలంలో ఎక్కువగా ఇన్‌ఫ్లూయెంజా, రైనో వైరస్, రెస్పిరేటరీ సిన్‌సైటియల్ వైరస్ తదితర వైరస్‌లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంటాయి. కరోనా కూడా శ్వాసకోస సంబంధిత వైరస్(respiratory virus) మరియు చలివాతారణంలో ఈ వైరస్ లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. యూరప్ దేశాల్లో..ముఖ్యంగా బ్రిటన్ లో చలికాలం ప్రవేశించే కొద్దిరోజుల ముందు కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సిందేనని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
అయితే, చలికాంలో ఫ్లూ వ్యాక్సిన్…కరోనావైరస్ నుంచి బ్రిటన్లను కాపాడేందుకు “కొత్త ఆయుధం”గా ఉపయోగపడుతుందని తాజాగా నిపుణలు చెబుతున్నారు. ఓ కొత్త అధ్యయనం ప్రకారం… ఫ్లూ వ్యాక్సిన్ లు కరోనావైరస్ ని చంపేసేందుకు అవసరమైన ఇమ్యూనిటీ సిస్టమ్ ను బలపరుస్తున్నట్లు…కరోనా మరణాలను పెద్దస్థాయిలో తగ్గించనున్నట్లు తేలింది.
పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్(PHE)రీసెర్చ్ ప్రకారం… కరోనా మొదటి వేవ్(జనవరి-ఏప్రిల్ మధ్య)లో ఫ్లూ మరియు కరోనా రెండూ సోకినవారు చాలా ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే మరియు మరణించే రిస్క్ లో వీళ్లు ఉన్నట్లు ఈ అధ్యయనం సూచించింది. ఒకే సమయంలో రెండూ సోకితే కరోనా పేషెంట్ల మరణాల సంఖ్య రెట్టింపయ్యే అవకాశముంది. బ్రిటన్ లోని ముగ్గురు సీనియర్ మెడిక్స్..డాక్టర్ వైవొన్ని డొయిలీ, ప్రొఫెసర్ జొనాథన్ వన్-టామ్, డాక్టర్ నికితా కన్నని ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరిగింది. అర్హులైన ప్రజలందరూ ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని వారు సూచించారు.
చరిత్రలోనే మొదటిసారిగా అతిపెద్ద NHS వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కింద….బ్రిటన్ వాసులకు ప్రస్తుతం 3కోట్ల ఉచిత ఫ్లూ వ్యాక్సిన్ ను అందించనున్నారు. నవంబర్ చివరిలోగా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా అత్యవసరమని ది రాయల్ కాలేజీ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్(RCGP)సృష్టంచేసింది. మరోవైపు, ఫ్లూ అనేది కూడా ప్రాణాంతకమైనదే. ప్రతి ఏడాది ఇంగ్లాండ్ లో ఈ వ్యాధి బారినపడి 11వేలమంది వరకు చనిపోతున్నారు..పెద్ద సంఖ్యలో హాస్పిటల్ బారినపడుతున్న విషయం అందరికీ తెలిసిందే.