Winter Storm Izzy In US: అమెరికాను వణికిస్తున్న ఇజ్జీ..190 కి.మీ వేగంతో విరుచుకుపడ్డ టోర్నడో

అగ్రరాజ్యం అమెరికాను ఇజ్జీ తుఫాను వణికిస్తోంది.శీతాకాలంలో ఆగ్నేయ ప్రాంతాన్ని చలి తుఫాను, పెనుగాలులు, హిమపాతం వణికిస్తున్నాయి.

Winter Storm Izzy In US : అగ్రరాజ్యం అమెరికాను ఇజ్జీ తుఫాను వణికిస్తోంది. శీతాకాలంలో ఆగ్నేయ ప్రాంతాన్ని చలి తుఫాను, పెనుగాలులు, హిమపాతం వణికిస్తున్నాయి. ఈ శీతల తుఫానుకు ఇజ్జీ అని పేరు పెట్టారు. ఈ తుఫాను ప్రభావంతో పలుప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయాలు, వృక్షాలు నేలకూలాయి. కరోలినాలో 1.5 లక్షల మంది ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

నల్లగా నిగనిగలాడే రోడ్లన్నీ మంచుతో కప్పబడి తెల్లగా మారిపోయాయి. జార్జియా, ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా తదితర ప్రాంతాలన్నీగత ఆదివారం నుంచి చలిపులికి వణికిపోతున్నాయి. ఈ మంచు ప్రభావానికి పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగుతున్నాయి. ఉత్తర కరోలినాలోని ఇంటర్‌స్టేట్ 95లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

శీతల తుఫానుకు ఫ్లోరిడాలో గంటకు 190 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో విరుచుకుపడ్డ టోర్నడో బీభత్సంతో ఒక ట్రైలర్‌ పార్క్‌ నాశనమైంది. అంతేకాదు ఈ శీతల తుఫాను పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగించటమే కాదు చార్లట్‌ డగ్లస్‌ విమానాశ్రయం నుంచి 1,200కు పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.

 

ట్రెండింగ్ వార్తలు