Dog Bites,Hair on woman Nose : కుక్క కాటు తెచ్చిన తంటా,యువతి ముక్కుమీద పెరుగుతున్న వెంట్రుకలు..

అందంగా ఉండే ఆమె ముక్కుపై వెంట్రుకలు పెరుగుతున్నాయి. ఇదంతా ఓ కుక్క కరవటం వల్ల జరిగింది. ముక్కుమీద పెరుగుతున్న వెంట్రుకలతో ఆమె మానసిక పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

Pet Dog bite..Hair growing on woman nose

Pet Dog bite..Hair growing on woman nose : ఆమె 20 ఏళ్ల యువతి. చక్కటి కనుముక్కు తీరుతో చక్కటి ముఖం. కానీ ఆమె అందాల ముఖం కాస్తా తన తండ్రి పెంచుకునే కుక్క వల్ల వికారంగా మారింది. ఆమె ముక్కుపై వెంట్రుకలు పెరిగి ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అందంగా చంద్రబింబంలా ఉండే ఆమె ముఖం కాస్తా ముక్కుపై వెంట్రుకలు పెరుగుతుండటంతో వింతగా మారిపోయింది. దీనికి కారణం ఆమె తండ్రి పెంచుకున్న కుక్క కరవటం వల్ల జరిగింది. అదేంటీ కుక్క కరవటానికి ఆమె ముక్కుమీద వెంట్రుకలు రావటానికి కారణమేంటీ అనుకుంటున్నారా..?

israel : తెగిన తలను అతికి అరుదైన శస్త్ర చికిత్స చేసిన వైద్యులు .. వైద్య రంగంలో మిరాకిల్.

2022 సెప్టెంబర్ లో ట్రినిటీ రౌల్స్ అనే 20 ఏళ్ల యువతి తన తండ్రిని కలవడానికి వెళ్లింది. ఆ క్రమంలో తండ్రి పెంచుకునే కుక్క తనపై దాడి చేసింది. దానికి ఏమైందో ఏమోగానీ ట్రినిటీపై దాడి చేసిన ఐదేళ్ల ఐరిష్ డాగ్ ఆమెను తీవ్రంగా గాయపరిచింది. కాళ్లు, చేతులను రక్కేసింది.ఈ దాడిలో సున్నితమైన కళ్లు, చెవులతో పాటు ముక్కుపై తీవ్ర గాయాలయ్యాయి. ముక్కు ముందు భాగం మొత్తం తెగిపోయింది. తీవ్ర గాయాలతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేశారు. ముక్కు భాగం అంతా తెగిపోవటంతో డాక్టర్లు ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. స్కిన్ గ్రాఫ్ట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. నుదిటిపై ఉన్న చర్మాన్ని తీసి ముక్కుపై వేసి సర్జరీ చేశారు. గాయాలు మానాయి. కాస్త అటు ఇటుగా ఆమె ముక్కు భాగంగా బాగానే కుదిరింది అనుకున్నారు. కానీ ఆ గాయాలు మానిపోయాకు ఇటీవల కాలంలో ఆమె ముఖంలో భారీగా మార్పులకు దారి తీసింది.

Tomato Prices : విమానం టికెట్ కొంటే టమాటాల ఫ్రీ .. హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు, టమాటాలా మజాకానా..!

సర్జరీ నుంచి కోలుకుంది. కానీ ఆ తరువాతే ఒక్కో సమస్య బయటపడుతోంది. ఆపరేషన్ చేసిన క్రమంలో నుదుటిపై చర్మాన్ని ముక్కుకు సర్జరీ చేయటంతో ఆమె ముఖంపై వెంట్రుకలు మొలవడం ప్రారంభమైంది. దీంతో ఆమె తన ఫోటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ముక్కుపై వెంట్రుకలతో ఉన్న ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె వెంట్రుకలు తొలగింపుకు ట్రీట్మెంట్ తీసుకుంటోంది. మరి ఈ సమస్య నుంచి ఆమె పూర్తిగా విముక్తి జరుగుతుందో లేదో వేచి చూడాలి..