Israel Attack
Israel Attack : గాజాపై ఇజ్రాయెల్ సైన్యం గర్జిస్తోంది. హమాస్ దాడి అనంతరం గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు హమాస్ నేతలను మట్టుబెట్టాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ సైనికులు భూ, వాయు, సముద్ర దాడికి సిద్ధమయ్యారు. 2006వ సంవత్సరం తర్వాత ఇజ్రాయెల్ సాగిస్తున్న అతి పెద్ద గ్రౌండ్ ఆపరేషన్. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడంతోపాటు ముప్పేట దాడికి ఇజ్రాయెల్ సమాయత్తమైంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ గాజాపై నేల, గగనతలం, సముద్రం ద్వారా ముప్పేట దాడికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.
హమాస్ ఉగ్రవాదులను చంపడమే లక్ష్యం
సైన్యం గాజా సరిహద్దు వెంబడి పెద్ద సంఖ్యలో తమ సైనికులను మోహరించింది. ఒక వారం క్రితం ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడి చేసింది అనంతరం గాజాలోని హమాస్ యొక్క అగ్ర రాజకీయ, సైనిక నాయకత్వాన్ని తొలగించడానికి ఇజ్రాయెల్ భూదాడి ప్రణాళిక రూపొందించింది. హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రధాన ప్రతినిధి డేనియల్ హగారి చెప్పారు. గాజా నగరం హమాస్‌కు బలమైన కోట. అయినప్పటికీ ఇజ్రాయెల్ దళాలు గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి భూ దండయాత్ర ప్రణాళిక రూపొందించింది.
8వ రోజుకు చేరిన యుద్ధం
హమాస్, దాని సైనిక సామర్థ్యాలను కూల్చివేయడం ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇజ్రాయెల్- హమాస్ మధ్య 8వ రోజు యుద్ధం సాగుతోంది. మరో హమాస్ కమాండర్ బిలాల్ అల్ కేద్రాను ఇజ్రాయెల్ హతమార్చింది. గాజాను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ హెచ్చరించిన తర్వాత, గాజా నుంచి ప్రజల వలసలు ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్ ఆర్మీ నాయకత్వం భూమిపై దాడికి సంబంధించిన సమయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
Also Read :Israeli Soldiers : ఇజ్రాయెల్ సైనికులకు మెక్‌డొనాల్డ్స్ ఉచిత భోజనం…లెబనాన్‌లో వెల్లువెత్తిన నిరసనలు
ఈ వారాంతంలోగా గాజాలోకి ప్రవేశించాలని సైన్యం మొదట ప్రణాళిక వేసింది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆలస్యమైంది. మేఘావృతమైన వాతావరణం భూ బలగాలకు ఎయిర్ కవర్ అందించడానికి పైలట్లు, డ్రోన్ ఆపరేటర్లకు అనుకూలంగా లేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ ఇజ్రాయెల్‌లోని గాజా సరిహద్దులో 30,000 మంది సైనికులను మోహరించింది.
Also Read :US Sends USS Eisenhower : ఇజ్రాయెల్ యుద్ధరంగంలోకి మరో అమెరికా విమాన వాహక నౌక
గ్రౌండ్ ఆపరేషన్ ప్లాన్ చేసేందుకు 10,000 మంది సైనికులు గాజాలోకి అడుగుపెట్టారు. పదాతిదళంతో పాటు, ఇజ్రాయెల్ రక్షణ బృందంలోని ట్యాంకులు, సాపర్లు, కమాండోలు కూడా ఉంటారని అధికారులు తెలిపారు. హమాస్ నగరం యొక్క ఉత్తర భాగంలో తమ యోధులను మోహరించినట్లు సమాచారం. హమాస్ ముష్కరులు వందల మైళ్ల భూగర్భ సొరంగాలు, గాజా నగరం, ఉత్తర గాజా పరిసర ప్రాంతాల కింద ఉన్న బంకర్లలో విడిది చేసినట్లు భావిస్తున్నారు.
Also Read :Maharashtra : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం…12 మంది మృతి, 23మందికి గాయాలు