Lucky Woman : అదృష్టమంటే ఈమెదే.. లాటరీని పర్సులో పెట్టుకుని తిరిగింది.. కోట్లు గెల్చుకుంది!

లాటరీ టికెట్ అందరూ కొంటారు. కానీ, కొందరికి మాత్రమే లాటరీలో లక్ కలిసివస్తుంది. జర్మనీకి చెందిన 45ఏళ్ల మహిళ కూడా లాటరీ టికెట్ కూడా కొనుగోలు చేసింది. తనకు తెలియకుండానే అదృష్టాన్ని వారం రోజులుగా పర్సులోనే పెట్టుకుని తిరిగింది.

Woman Carries Winning Lottery Ticket Worth Usd 39 Million In Purse For Weeks

Woman winning lottery ticket  : లాటరీ టికెట్ అందరూ కొంటారు. కానీ, కొందరికి మాత్రమే లాటరీలో లక్ కలిసివస్తుంది. జర్మనీకి చెందిన 45ఏళ్ల మహిళ కూడా లాటరీ టికెట్ కూడా కొనుగోలు చేసింది. కానీ, కొన్న టికెట్ విషయాన్ని మరిచిపోయింది. ఆ టికెట్ కోట్లు విలువైనది తెలియక కొన్నివారాలుగా పర్సులోనే పెట్టుకుని తిరిగేసింది.

లాటరీ రిజల్ట్స్ వచ్చిన విషయం గుర్తుకురాగానే తన టికెట్ కోసం వెతికింది. పర్సులో దాచిన టికెట్ చెక్ చేసుకోగా.. కోట్లు గెలిచినట్టు తెలిసి ఎగిరి గంతేసింది. తను కొన్న టికెట్‌పై 39 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.290.53 కోట్ల) బంపర్‌ డ్రా తగిలింది.

అంతే ఆ మహిళ ఆనందానికి అవధుల్లేవు. జూన్‌ 9న లాటరీ ఫలితాలను ప్రకటించగా.. 1.20 యూరోలు (దాదాపు రూ.105) పెట్టి టికెట్‌ను కొనేసింది. తన లాటరీ టికెట్‌లోని 7 నంబర్లను చెక్ చేసుకోగా.. కోట్ల లాటరీ తగిలిందని తెలిసి ఆనందంతో చిందులేసింది.

లాటరీ కొన్న సమయంలో లక్ పై ఆమెకు నమ్మకమే లేదట.. లాటరీ టికెట్ పారేద్దమని అనుకుందట.. కానీ, పర్సులో పెట్టుకుని మరిచిపోయి మంచిదైందని అంటోంది. కోట్ల లాటరీ గెల్చుకుంటానని తాను ఎప్పుడు కలలో కూడా ఊహించలేదని పట్టరాని సంతోషంతో చెబుతోంది.