ఇంగ్లండ్ : అవును మీరు చదువుతోంది..నిజమే…దుప్పటే నా మొగుడు అంటోంది..ఓ ప్రేయసి…దుప్పటినే పెళ్లి కూడా చేసుకుంటానంటోంది. గిదేం పిచ్చి…అంటారు..ప్రేమ అనేది పిచ్చిదే. ఈ ఘటన ఇంగ్లండ్‌లో చోటు చేసుకుంది.
ఇంగ్లండ్‌లో ఎక్సెటర్‌లో పస్కేల్ సెల్లిక్ (49) మహిళ నివాసం ఉంటోంది. ఈమె పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. ఇందుకు ఫిబ్రవరి 10వ తేదీన ముహూర్తం నిర్ణయించారు. ఎక్సెటర్‌లోని రౌగ్మొంట్ గార్డెన్స్‌లో ఫిబ్రవరి 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి వేడుక ఉంటుందని అందరూ రావాలని బంధుమిత్రులకు..ఇతరులకు వెడ్డింగ్ ఇన్విటేషన్స్ పంపించింది. పెళ్లి కొడుకు ఎవరా అని ఆరా తీస్తే…బొంత అని తేలడంతో అందరూ నోరెళ్లబెడుతున్నారు. తనకు ఎల్లప్పుడూ వెచ్చదనం ఇచ్చే బొంతను పెళ్లి చేసుకుంటున్నా అని పేర్కొంటోంది. ఇది ఇచ్చే సుఖం సొంత మగాడు ఇవ్వలేడని పేర్కొంటోంది. పెళ్లి రోజున రొటీన్ డ్రస్‌లకు బదులు స్లిప్పర్, నైట్ గౌన్ ధరిస్తానని తెలిపింది. ఈ బొంతను ఎంతగానో ప్రేమిస్తున్నా…అందరూ ఆహ్వానితులే..అంటూ ఆమే పేర్కొన్న ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.