బీచ్‌లో ఈతకొడుతూ 80కి.మీ సముద్రంలోకి కొట్టుకుపోయిన యువతి.. 37గంటల తరువాత ఏం జరిగిందంటే?

పాన్ లో ఓ యువతి 37గంటల పాటు పసిఫిక్ మహా సముద్రంలో మృత్యువుతో పోరాడి చివరికి ..

helicopter carrying young woman

Woman Swept Out To Sea In Japan Rescued After 37Hours : జపాన్ లో ఓ యువతి 37గంటల పాటు పసిఫిక్ మహా సముద్రంలో మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలతో బయటపడింది. చైనాకు చెందిన 20ఏళ్ల యువతి జపాన్ లోని షిమోడా నగర బీచ్ లో స్విమ్మింగ్ రింగ్ ధరించి తన స్నేహితురాలితో కలిసి ఈత కొడుతుంది. ఈ క్రమంలో పెద్ద అలలు రావడంతో అలల ధాటికి అకస్మాత్తుగా సముద్రంలోకి కొట్టుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన యువతి స్నేహితురాలు జపాన్ తీర గస్తీ దళానికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో వారు అక్కడకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read : విశాఖ ప్రాధాన్యమేంటి? ఈ నగరంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్‌ చేయడానికి కారణమేంటి?

జపాన్ తీర గస్తీ దళం ఎంత వెతికినా ఆమె జాడ కనిపించలేదు. యువతి సముద్రంలో గల్లంతై 30గంటలు పూర్తయినా ఆమె ఆచూకీ లభించక పోవటంతో యువతి మృతిచెంది ఉంటుందని అందరూ భావించారు. బుధవారం తెల్లవారు జామున బోసో ద్వీపకల్పపు దక్షిణ దిశలోని సముద్ర జలాల్లో ఓ యువతి స్విమ్మింగ్ రింగ్ వేసుకొని నీటిలో తేలియాడుతున్నట్లు ఓ కార్గో షిప్ సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆ సిబ్బంది వారికి సమీపంలో ప్రయాణిస్తున్న మరో కార్గో షిప్ సిబ్బందికి సమాచారం అందించి సహాయం కోరారు. రెండు కార్గో షిప్ లలోని సిబ్బంది సముద్రంలోకి దూకి యువతిని రక్షించారు.

Also Read : AP Oil Refinery : ఆంధ్రప్రదేశ్‌లో రూ.60వేల కోట్లతో భారీ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

యువతి స్విమ్మింగ్ రింగ్ ధరించి ఉండటంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ప్రాథమిక చికిత్స అందించారు. యువతిని కాపాడిన విషయాన్ని జపాన్ తీరదళంకు కార్గో షిప్ సిబ్బంది సమాచారం అందించారు. దీంతో జపాన్ తీరదళం హుటాహుటీన హెలికాప్టర్ ను పంపించి యువతిని తీరానికి చేర్చారు. అనారోగ్యంతో ఉండటంతో వెంటనే యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకరోజు చికిత్స అనంతరం ఆమెకు పూర్తిగా కోలుకోవటంతో డిశ్చార్జ్ చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు