AP Oil Refinery : ఆంధ్రప్రదేశ్‌లో రూ.60వేల కోట్లతో భారీ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

AP Oil Refinery : జూలై 23న సమర్పించే బడ్జెట్‌లో ఏపీలో ఆయిల్ రిఫైనరీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. స్థలాలను అంచనా వేసి, ఆపై ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.

AP Oil Refinery : ఆంధ్రప్రదేశ్‌లో రూ.60వేల కోట్లతో భారీ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

PM Modi grants Naidu's Rs 60k crore wish of petrochem hub, oil refinery ( Image Source : Google )

Updated On : July 11, 2024 / 10:48 PM IST

AP Oil Refinery : ఏపీలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఐదు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో రూ. 60వేల కోట్ల పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌కు కేంద్రం అంగీకరించింది.

Read Also : Hyderabad Traffic Police : హైదరాబాద్‌లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌.. 10రోజుల్లో 1,614 మందిపై కేసులు..!

కేంద్రంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఎ) ప్రభుత్వంలో కీలక మిత్రుడుగా చంద్రబాబు రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( బీపీసీఎల్ ) ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

రిఫైనరీ ఏర్పాటు అయ్యే మూడు ప్రాంతాలివేనా? :
అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పెట్రోలియం రిఫైనరీ కోసం ఏపీలో మూడు ప్రధాన ప్రదేశాలపై చర్చించారు. వీటిలో శ్రీకాకుళం, మచిలీపట్నం, రామాయపట్నం ఉన్నాయి. జూలై 23న సమర్పించే బడ్జెట్‌లో రిఫైనరీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. స్థలాలను అంచనా వేసి, ఆపై ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.

ఈ ప్రక్రియకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని, బడ్జెట్‌లో రిఫైనరీ ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని ప్రకటించకపోవచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిఫైనరీ ఏర్పాటు చేయబోయే మూడు లొకేషన్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉన్నందున ఈ ప్రకటన రాజకీయంగా సున్నితమైనదిగా చెప్పవచ్చు.

చంద్రబాబుకు చెందిన 16 మంది ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఎ ప్రభుత్వానికి అవసరమైన మద్దతును అందిస్తారు. రిఫైనరీ అనేది రాష్ట్ర విభజన సమయంలో చేసిన నిబద్ధత, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో నిర్దేశించింది. చట్టంలోని సెక్షన్ 93 ప్రకారం.. పదమూడవ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా అవసరమైన అన్ని చర్యలను కేంద్రం తీసుకుంటుంది.

అంతేకాదు.. ఐఓసీ లేదా హెచ్‌పీసీఎల్ నియమిత రోజు నుంచి ఆరు నెలలలోపు ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్ ముడి చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను స్థాపించే సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏపీ పెట్రోకెమికల్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

రూ. 60వేల కోట్ల నుంచి రూ. 70వేల కోట్ల పెట్టుబడితో ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ స్థాపనను 90లో ప్రారంభించగా.. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 5వేల ఎకరాల భూమి అవసరం పడుతుంది. అందుకే, అవాంతరాలు లేని పద్ధతిలో రిఫైనరీ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

Read Also : టార్గెట్ జగన్..! శ్వేతప్రతాల వెనుక చంద్రబాబు భారీ వ్యూహం..!