Hyderabad Traffic Police : హైదరాబాద్‌లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌.. 10రోజుల్లో 1,614 మందిపై కేసులు..!

Hyderabad Traffic Police : హైదరాబాద్ నగరంలోపలుచోట్ల ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 1,614 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు.

Hyderabad Traffic Police : హైదరాబాద్‌లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌.. 10రోజుల్లో 1,614 మందిపై కేసులు..!

Special drunk and drive in Hyderabad City ( Image Source : Google )

Hyderabad Traffic Police : మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని హెచ్చరిస్తున్నా కొంచెం కూడా పట్టించుకోవడం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహనాలు నడుపుతూ అడ్డంగా పోలీసులకు చిక్కుతున్నారు.

ఎన్ని స్పెషల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లు పెట్టినా మద్యం ప్రియుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తాజాగా, హైదరాబాద్ నగరంలోపలుచోట్ల ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనాదారుల మత్తు వదిలిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. గడిచిన పదిరోజులుగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.

మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 1,614 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. 992 మందిపై ఛార్జ్ షీట్లు నమోదు చేశారు. 55 మందికి ఒకరు రోజు నుంచి 15 రోజుల జైలు శిక్ష విధించారు. 8 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేశారు. అత్యధికంగా 1346 టూ వీలర్స్ పై కేసు నమోదు చేశారు ట్రాఫిక్ పోలీసులు.

Read Also : NEET-UG Paper Leak Case : నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో కీలక సూత్రధారి ‘రాకీ’ అరెస్ట్!