NEET-UG Paper Leak Case : నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో కీలక సూత్రధారి ‘రాకీ’ అరెస్ట్!

NEET-UG Paper Leak Case : పాట్నా నగర ప్రాంతాల్లో రంజన్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ వెంటనే ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపర్చింది. దాంతో నిందితుడిని 10 రోజుల పాటు సీబీఐ కస్టడీకి పంపుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

NEET-UG Paper Leak Case : నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో కీలక సూత్రధారి ‘రాకీ’ అరెస్ట్!

CBI Arrests Rocky, Alleged Mastermind In NEET-UG Paper Leak Case ( Image Source : Google )

NEET-UG Paper Leak Case : నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న రాకేష్ రంజన్, అలియాస్ రాకీ అనే వ్యక్తిని సీబీఐ అరెస్టు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పాట్నా నగర ప్రాంతాల్లో రంజన్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ వెంటనే ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపర్చింది. దాంతో నిందితుడిని 10 రోజుల పాటు సీబీఐ కస్టడీకి పంపుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read Also : NEET-UG 2024 : నీట్ యూజీ పరీక్ష రద్దు, అక్రమాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ..

ఈ కేసులో బీహార్‌లోని పాట్నా, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా సమీపంలో నాలుగు చోట్ల సీబీఐ దాడులు నిర్వహించింది. నీట్ పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను లీక్ చేసిన ముఠాపై రాష్ట్ర పోలీసు బలగాలు, సీబీఐ సంయుక్తంగా దర్యాప్తు చేసి కీలక సాక్ష్యాలను సేకరించాయి. ఈ కేసులో ఇప్పటివరకూ జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌తో సహా డజనుకుపైగా అరెస్టయ్యారు. ఈ కేసుకు సంబంధించి రాకీ మినహా ఎనిమిది మందిని సీబీఐ అరెస్టు చేసింది.

దేశవ్యాప్తంగా పరీక్ష పేపర్ రాకెట్‌పై దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన ఏజెన్సీ బీహార్‌లో మూడు వేర్వేరు కేసులకు 5 సహా 6 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసింది. నీట్ పేపర్ లీకేజీకి హజారీబాగ్ పాఠశాలతో సంబంధం ఉందని సీబీఐ వర్గాలు తెలిపాయి. అక్కడి నుంచి లీకైన పేపర్లు కూడా బీహార్‌కు చేరుకున్నాయని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.

మే 5న జరగాల్సిన పరీక్షకు సంబంధించిన తొమ్మిది సెట్ల పేపర్లు భద్రపరిచేందుకు రెండు రోజుల ముందుగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు చేరుకున్నాయని సీబీఐ తెలిపింది. అక్కడి నుంచి పరీక్ష కేంద్రమైన హజారీబాగ్‌లోని ఒయాసిస్‌ పాఠశాలకు రెండు సెట్‌లను తరలించి పాఠశాలకు చేరుకునే సరికి వాటిపై ఉన్న సీల్స్‌ తొలగించినట్టు దర్యాప్తులో గుర్తించింది.

ప్రశ్న పత్రాలు సీల్ తొలగించిన సమయంలో రాకీ అక్కడే ఉన్నాడని ఏజెన్సీ వర్గాలు పేర్కొన్నాయి. నిందితుడు రాకీ నీట్ పేపర్ ప్రశ్నలను ఫొటోలు తీసి వాటిని లీకేజీ ముఠాకు షేర్ చేశాడు. లీకైన పేపర్‌లకు సమాధానాలపై లక్షల్లో ధరకు అమ్ముకున్నారని దర్యాప్తులో తేలింది.

రెండు దశాబ్దాలుగా ఈ స్కామ్‌లో పాల్గొని పరారీలో ఉన్న ఈ రాకెట్‌లోని మరో కీలక వ్యక్తి సంజీవ్ ముఖియాతో కూడా రాకీకి సంబంధం ఉందని దర్యాప్తు బృందం గుర్తించింది. పేపర్లు ఎక్కడి నుంచి లీక్ అయ్యాయో స్పష్టంగా తెలియనప్పటికీ, బ్యాంకు బ్రాంచ్ నుంచి, పాఠశాలకు రవాణా చేస్తున్నప్పుడు లేదా పాఠశాల నుంచి ఉండవచ్చునని సీబీఐ వర్గాలు తెలిపాయి.

Read Also : ICAI CA Final Result 2024 : ఐసీఏఐ సీఏ ఫైనల్, ఇంటర్ రిజల్ట్స్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. సీఏ ఇంటర్ టాపర్లు వీరే..!