ICAI CA Final Result 2024 : ఐసీఏఐ సీఏ ఫైనల్, ఇంటర్ రిజల్ట్స్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. సీఏ ఇంటర్ టాపర్లు వీరే..!

ICAI CA Final Result 2024 : ఐసీఏఐ సీఏ మే ఫైనల్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 2024, ఐసీఏఐ సీఏ ఫలితంతో పాటు, సంస్థ మెరిట్ జాబితాను కూడా విడుదల చేసింది. విద్యార్థులు తమ స్కోర్‌లను icai.nic.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ICAI CA Final Result 2024 : ఐసీఏఐ సీఏ ఫైనల్, ఇంటర్ రిజల్ట్స్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. సీఏ ఇంటర్ టాపర్లు వీరే..!

ICAI CA Final, Inter Results 2024 _ ICAI results ( Image Source : Google )

ICAI CA Final Result 2024 : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ఈరోజు (జూలై 11) సీఏ ఫైనల్, ఇంటర్ ఫలితాలను విడుదల చేసింది. ఐసీఏఐ ఫలితాలతో పాటు, సంస్థ సీఏ ర్యాంక్ జాబితాను కూడా విడుదల చేసింది. ఐసీఏఐ విద్యార్థులు ఇప్పుడు తమ మే 2024 పరీక్ష స్కోర్‌లను అధికారిక వెబ్‌సైట్‌లు icaiexam.icai.org లేదా icai.org లేదా icai.nic.in నుంచి చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐసీఏఐ సీఏ ఇంటర్మీడియట్ ఫైనల్ రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రోల్ నంబర్‌లు, రిజిస్ట్రేషన్ నంబర్‌లు లేదా పిన్ నంబర్‌లతో లాగిన్ అవ్వాలి.

సీఏ ఇంటర్ టాపర్లు వీరే :
ఈ సీఏ ఫలితాల్లో అనేక మంది అభ్యర్థులు టాప్ ర్యాంకర్లుగా నిలిచారు. వారిలో న్యూఢిల్లీకి చెందిన శివమ్ మిశ్రా 83.33 శాతం (500 మార్కులు) స్కోర్ చేసి సీఏ ఫైనల్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచాడు. రెండవ స్థానంలో ఢిల్లీకి చెందిన వర్షా అరోరా 480 మార్కులతో ఉండగా, ఏఐఆర్ 3 ర్యాంకులో ముంబైకి చెందిన కిరణ్ మన్రాల్, నవీ ముంబైకి చెందిన ఘిల్మాన్ సాలిమ్ అన్సారీ నిలిచారు. ఒక్కొక్కరు 477 మార్కులు (79.50 శాతం) సాధించారు. ఐసీఏఐ మే 2024 ఇంటర్మీడియట్ పరీక్షలను (గ్రూప్ 1) మే 3, 5, 9 తేదీల్లో నిర్వహించగా, గ్రూప్ 2 ఇంటర్ పరీక్షలు మే 11, 15, 17 తేదీల్లో నిర్వహించారు. గ్రూప్ 1 కోసం సీఏ ఫైనల్ పరీక్షలు మే 2, 4, 8 తేదీల్లో నిర్వహించారు. మే 10, 14, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరిగాయి.

సీఏ ఇంటర్ టాపర్ ఎలా ప్రిపేర్ అయ్యాడంటే? :
19 ఏళ్ల కుషాగ్రా రాయ్ 11వ తరగతి నుంచి సీఏ ఫౌండేషన్ పరీక్షకు సిద్ధమయ్యాడు. తన సీఏ ఇంటర్మీడియట్ ప్రిపరేషన్ కోసం కోచింగ్ సెంటర్ నుంచి గైడెన్స్ కూడా తీసుకున్నాడు. అకౌంటెంట్స్, కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్, అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్ సబ్జెక్టులు సులువైనవి, స్కోరింగ్ సబ్జెక్టులని టాపర్ తెలిపాడు. ఆడిటింగ్, ఎథిక్స్ పూర్తిగా సైద్ధాంతికమైన సబ్జెక్ట్‌లని, ప్రతి విషయాన్ని గుర్తుంచుకోవడం అంత తేలిక కాదని పేర్కొన్నాడు.

రోజుకు 11 గంటల నుంచి 13 గంటలు పరీక్షకు కేటాయిస్తూ.. కుశాగ్రా వాట్సాప్ తప్ప మరే ఇతర సోషల్ మీడియాను ఉపయోగించలేదు. “నేను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అన్‌ఇన్‌స్టాల్ చేసాను. కానీ, ఇప్పుడు నేను వాటిని మళ్లీ ఇన్‌స్టాల్ చేసాను. 12వ తరగతిలో 93.2 శాతం మార్కులు సాధించాను’’ అని చెప్పుకొచ్చాడు. సీఏ ఇంటర్ టాపర్ ఇంకా ఏమన్నాడంటే.. “నేను బాగా స్కోర్ చేస్తానని నాకు తెలుసు, కానీ ఏఐఆర్ 1 సాధించడం నాకు ఖచ్చితంగా తెలియదు,” అని రాయ్ చెప్పాడు. తాను పాఠశాలలో ఉన్నప్పుడే సీఏ కావాలని నిర్ణయించుకున్నాని తెలిపాడు.

ఇంటర్‌లో శివమ్ మిశ్రా AIR ర్యాంక్ హోల్డర్ :
ఏఐఆర్ 1 మొదటి ప్రయత్నంలో I, II అనే రెండు గ్రూపులలో సీఏ ఫైనల్ పరీక్షలను క్లియర్ చేసాడు. 2019లో జరిగిన సీఏ ఫౌండేషన్ పరీక్షలో ఏఐఆర్ 50లో 2020లో ఇంటర్మీడియట్ స్థాయి పరీక్షలో ఏఐఆర్ 20లో కూడా స్థానం పొందాడు. న్యూఢిల్లీకి చెందిన శివమ్ మిశ్రా తన సీఏ ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. మొదటి ప్రయత్నంలోనే AIR1 ర్యాంకు పొందాడు.

ఐసీఏఐ సీఏ ఫైనల్, ఇంటర్ పరీక్ష.. ఉత్తీర్ణత, అర్హతలు :
ఐసీఏఐ, సీఏ ఇంటర్, సీఏ చివరి మే 2024 పరీక్షలో అర్హత సాధించడానికి అభ్యర్థులు ప్రతి పేపర్‌లో కనీసం 40 శాతం, ప్రతి గ్రూప్‌లో కనీసం 50 శాతం స్కోర్ సాధించాలి.

సీఏ ఫైనల్ ఫలితాలను చెక్ చేయండిలా :
సీఏ ఫైనల్ మే 2024 ఫలితాలను చెక్ చేసేందుకు డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు ఐసీఏఐ, సీఏ ఫలితాల లాగిన్ విండోలో 6 అంకెల రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఐసీఏఐ సీఏ రిజల్ట్స్ చెక్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ icai.nic.in సందర్శించండి.

Read Also : Redmi K70 Ultra : ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రెడ్‌మి K70 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. జూలై 18నే రిలీజ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?