World Bank: యుక్రెయిన్‌కు వరల్డ్ బ్యాంక్ భారీ సాయం
వారాల తరబడి రష్యాతో పోరాడుతున్న యుక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికే యూకే పీఎం బోరిస్ జాన్సన్ తాము 100బిలియన్ డాలర్ల సాయం ప్రకటిస్తున్నట్లు చెప్పగా ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా

World Bank Subhan 10tv
World Bank: వారాల తరబడి రష్యాతో పోరాడుతున్న యుక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికే యూకే పీఎం బోరిస్ జాన్సన్ తాము 100బిలియన్ డాలర్ల సాయం ప్రకటిస్తున్నట్లు చెప్పగా ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా ఆసరాగా నిలబడేందుకు ముందుకొచ్చింది. భారీ ఆర్థిక ప్రకటిస్తున్నట్లుగా తెలిపింది ప్రపంచ బ్యాంక్.
వరల్డ్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయంతో యుక్రెయిన్‌కు 723మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందనుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి నుంచి బయటపడేందుకు సప్లిమెంటరీ బడ్జెట్ సపోర్ట్ ప్యాకేజీకి ఆమోదం తెలిపారు వరల్డ్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు.
ప్యాకేజీలో 350 మిలియన్ డాలర్లు అనుబంధ రుణం, 139 మిలియన్ డాలర్లు గ్యారెంటీ, 134 మిలియన్ డాలర్లు గ్యాంట్ ఫైనాన్సింగ్, 100 మిలియన్ డాలర్లు ఫైనాన్సింగ్ సమీకరణ కోసం నిధులుగా కేటాయించారు.
Read Also: COVID-19 నుంచి కోలుకునేందుకు వరల్డ్ బ్యాంక్ 400మిలియన్ డాలర్ల సాయం
యుక్రెయిన్ ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు ఆర్థిక ప్యాకేజీకి ఉపయోగపడుతుందని వరల్డ్ బ్యాంకు తెలిపింది.