World Coconut Day 2021: కొబ్బరి దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? ముఖ్య ఉద్ధేశ్యమేంటీ?

సెప్టెంబర్ 2 ప్రపంచ కొబ్బరి దినోత్సవం.కొబ్బరి దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? ముఖ్య ఉద్ధేశ్యమేంటీ? ఈ రోజు ఎలా ఏర్పడింది?వంటి ఎన్నో విషయాలు..విశేషాలు..

World Coconut Day 2021: దీని నుండి అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు పాక ఉపయోగాలను కలిగి ఉంది. చిరు తిళ్లు, ఫాస్ట్ ఫుడ్, ఇన్ స్టంట్ ఫుడ్ పేరుతో మనం అనారోగ్యాల బారిన పడుతున్నాం. కానీ సహజంగా లభించే కొబ్బరి వల్ల మనకు ఎన్నో లాభాలున్నాయి. కొబ్బరి నీళ్లు, కొబ్బరి పాలు, వీటన్నింటినీ అన్ని రకాల వంటకాల్లో ఉపయోగించొచ్చు. ఈ ప్రత్యేకమైన కొబ్బరి యొక్క ఉపయోగాల గురించి అవగాహన కల్పించడానికి, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా కొబ్బరి దినోత్సవం ఎప్పుడు మొదలైంది..

ఈ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు.. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యమేంటి అనే వివరాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కొబ్బరి ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.కొబ్బరి గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పుకోవచ్చు.కొబ్బరి చెట్టు కాండం. కాయలు,ఆకులు, కొబ్బరి నీళ్లు, పీచు, కొబ్బరి పాలు,నూనె ఇలా ఈ చెట్టు మనషి కోసం ఆ భగవంతుడే భూలోక కల్పవృక్షంగా ఇచ్చాడా అనిపిస్తుంది. మనకు ప్రకృతిమాత ఇచ్చిన ఎన్నో అపార సందపదల్లో కొబ్బరి ఒకటి.

ప్రపంచ కొబ్బరి దినోత్సవం 2021 థీమ్..
ఈ సంవత్సరం కూడా కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరినీ ఎంతగా దెబ్బతీసిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు. 2021 సంవత్సరలో ప్రపంచ కొబ్బరి దినోత్సవ థీమ్ ‘కోవిద్-19 మహమ్మారి మరియు అంతకుమించి సురక్షితమైన సమ్మిళిత స్థితిస్థాపక..స్థిరమైన కొబ్బరి సమాజాన్ని నిర్మించడం’.గా ఏర్పడింది.

ప్రపంచ కొబ్బరి దినోత్సవ చరిత్ర విశేషాలు..
ఈ రోజును జరుపుకోవడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా కొబ్బరి ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాటం. కొబ్బరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడం. ఆసియా, పసిఫిక్ కొబ్బరి ద్వారా ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతాల కింద ఉన్న దేశాలలో ఈరోజు ప్రత్యేకంగా గుర్తించబడింది. ఎందుకంటే అవి ప్రపంచంలో అత్యధికంగా కొబ్బరి పండించే ఉత్పత్తి కేంద్రాలను కలిగి ఉండటమే.

2009 సంవత్సరంలో 2009 సంవత్సరంలో తొలిసారిగా ప్రపంచ కొబ్బరి దినోత్సవం జరిగింది. జకార్తా, ఇండోనేషియాలో ప్రధాన కార్యాలయం ఉన్న యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా మరియు పసిఫిక్ యొక్క ప్రధాన అధికారంలో పని చేస్తుంది. ఈరోజును గుర్తించే ఉద్దేశ్యం పాలసీలను హైలెట్ చేయడంతో పాటు కార్యాచరణ ప్రణాళికను వ్యక్తం చేయడం.

కొబ్బరి ఉత్పత్తిలో భారతే నెంబర్ 1..
ప్రపంచ దేశాల్లో కొబ్బరి చెట్టు లేని దేశం అంటూ ఉండదు. ప్రతీదేశం కొబ్బరిని గౌరవిస్తుంది. అన్ని కాలాల్లోను పంట ఇచ్చే చెట్టు కొబ్బరి చెట్టు. అలా భారత్ లో కొబ్బరి చెట్టుకు ఉండే ప్రత్యేకత అంతా ఇంతా కాదు. అన్ని శుభకార్యాల్లోను కొబ్బరి బోండాలు,కొబ్బరి కాయలు,కొబ్బరి నూనె,కొబ్బరి పొత్తు ఉండాల్సిందే. మన దేశంలో కేరళ అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది కొబ్బరి చెట్లే.

ఈక్రమంలో ప్రపంచ దేశాల్లో కొబ్బరి ఉత్పాదకత కలిగిన దేశాల్లో భారతదేశం అగ్రస్థానం ఉంది. కొబ్బరి డెవలప్ మెంట్ బోర్డు(CDB) మద్దతుతో కేరళ, తమిళనాడు, కర్నాటక, గోవా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాలలో ఈరోజును జరుపుకుంటారు. కొబ్బరి ఉత్పత్తిని పెంచడానికి,వినియోగానికి సంబంధించి అవగాహన కోసం నిపుణులచే అవగాహన ప్రచారాలు మరియు సాంకేతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి హాజరవుతారు. కొబ్బరి ఉత్పత్తుల గురించి ఆలోచనలు షేర్ చేసుకుంటారు. రైతులు,వ్యాపారవేత్తలకు కొబ్బరి అక్షయపాత్రే అని చెప్పాలి. కొబ్బరి వ్యాపారాలు కోట్లల్లో జరుగుతాయి.


కొబ్బరితో ప్రయోజనాలు.. కొబ్బరి ఉత్పత్తి మరియు వైవిధ్యం కాకుండా, కొబ్బరి పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా పేదరిక నిర్మూలనలో కొబ్బరి పోషించగల ముఖ్యమైన పాత్రను సూచించడానికి ప్రపంచ కొబ్బరి దినోత్సవ ప్రయత్నిస్తుంది. 2021 సంవత్సరంలో ప్రపంచ కొబ్బరి దినోత్సవం 23వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది.

ఖనిజాలు, ప్రోటీన్లు,బి-విటమిన్లు సమ్మేళనం కొబ్బరి. కొబ్బరిలో ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గించడానికి కొబ్బరి నూనె చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మీ చర్మాన్ని కూడా తేమను సమకూరుస్తుంది. శీతాకాలంలో శరీరం పొడిబారిపోకుండా కొబ్బరి నూనె రాసుకుంటారు. దీంతో శరీరం నిగారింపుగా ఆరోగ్యంగా ఉంటుంది.

కొబ్బరి నూనె రాసుకుంటే హానికరమైన సూక్ష్మజీవులు శరీరానికి హానీ చేయకుండా సహాయపడుతుంది. కొబ్బరి నీరు రిఫ్రెష్ పానీయం అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.మూత్రపిండాల్లో రాళ్లను ఇట్టేకరిగించేస్తుంది. అలాగే తక్షణ శక్తినివ్వటంలో కొబ్బరి నీళ్లను మించిన ఔషధ లేదంటూ ఏమాత్రం అతిశయోక్తి కాదు. కొబ్బరి, కొబ్బరి నీళ్లు శక్తి స్థాయిలను కూడా పెంచుతాయి. అంతేకాదు కొబ్బరి చెట్టు కాండం,ఆకులు,పీచు, నూనె, నీళ్లు,కొబ్బరి పువ్వు ఇలా కొబ్బరి చెట్టు అంటే భూలోక కల్పవృక్షమే.

ట్రెండింగ్ వార్తలు