World Bank Report: 2023లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తలెత్తనుందా? ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలో ఏముందంటే?

1970 మాంద్యం తర్వాత కోలుకున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అత్యంత మందగమనంలో ఉందని ప్రపంచ బ్యాంకు తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ క్రమంలో వడ్డీరేట్ల పెంపు కారణంగా 2023లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశం ఉందని వరల్డ్‌ బ్యాంక్‌ అంచనా వేసింది.

World Bank president David Malpass

World Bank Report: 2023లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశం ఉందా అంటే ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక అవుననే చెబుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ఏకకాలంలో వడ్డీరేట్లను పెంచుతున్నాయి. రేట్ల పెంపుతో రుణాలను మరింత ఖరీదైన వ్యవహారంగా మార్చి ధరలను తగ్గించాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ ఇదే సమయంలో ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది.

Gautam Adani the world’s second richest man: ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరుకున్న గౌతమ్‌ అదానీ

1970 మాంద్యం అనంతరం కోలుకున్న తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అత్యంత మందగమనంలో ఉందని తెలిపింది. అమెరికా, చైనా, ఐరోపా ఆర్థిక వ్యవస్థలు బాగా మందగించాయని నివేదికలో వెల్లడించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఓ మోస్తరు ఎదురు దెబ్బ తగిలినా.. ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుందని నివేదికలో పేర్కొంది. త్వరలో అమెరికా ఫెడరల్‌ రిజర్వు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌(బీవోఈ) పరపతి విధాన సమీక్షలు జరగనున్న సమయంలో ఈ హెచ్చరికలు వెలువడటం గమనార్హం.

Mukesh Ambani Visited Tirumala: కాబోయే కోడలు రాధికతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖేష్ అంబానీ

“ప్రపంచ వృద్ధి బాగా మందగిస్తోంది. మరిన్ని దేశాలు మాంద్యంలోకి పడిపోవడంతో మరింత మందగించే అవకాశం ఉంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలోని ప్రజలకు వినాశకరమైన దీర్ఘకాలిక పరిణామాలతో ఈ పోకడలు కొనసాగుతాయని నా లోతైన ఆందోళన అంటూ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ గురువారం నివేదిక విడుదల చేసిన తర్వాత ఒక ప్రకటనలో తెలిపారు. అయితే.. సరఫరా పరిమితుల నుండి ఉత్పన్నమయ్యే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి కేవలం వడ్డీ రేట్లను పెంచడం సరిపోదని, దేశాలు వస్తువుల లభ్యతను పెంచడంపై దృష్టి పెట్టాలని తాజా ప్రపంచ బ్యాంక్ నివేదిక నొక్కి చెప్పింది.