World Most Expensive Pineapple
Most Expensive Pineapple : ఒక్క పైనాపిల్ (అనాస) పండు ధర ఎంత ఉంటుంది? రూ.50 ఉంటుంది.మహా అయితే రూ.100 ఇంకా అంటే ఓ రూ.200 ఉంటుందేమో. కానీ ఇదిగో మనం ఇప్పుడు చెప్పుకునే పైనాపిల్ పండు మాత్రం అక్షరాలా లక్ష రూపాయలు..! ఏంటీ దిమ్మ తిరిగిపోయింది కదూ ధర వింటే..ఇంగ్లాండ్‌లో లభ్యమయ్యే హెలిగాన్ పైనాపిల్ ధర వింటే అలాగే ఉంటుంది. ఇంతకంటే ఆశ్చర్యం మరొకటి ఉంది. ఒక్కోసారి ఒక్క పైనాపిల్ పండును వేలం వేస్తే రూ.10లక్షల ధర కూడా పలుగుతుందట..!!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హెలిగాన్ పైనాపిల్స్
పైనాపిల్ విటమిన్-సి ఎక్కువగా లభించే పండు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు మాంగనీస్, పొటాషియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. తక్కువ ధరలో చక్కటి పోషకాలు ఎక్కువుండే ఈ పండును జనాలు కొనుక్కుని తింటుంటారు. కానీ..ఇంగ్లాండ్‌లో లభ్యమయ్యే హెలిగాన్ పైనాపిల్ మాత్రం అక్షరాల లక్ష రూపాయలు పలుకుతోంది. ఈ ధర వల్లే ప్రపంచంలో ఇదే అత్యంత ఖరీదైన పైనాపిల్ గా పేరొందింది. ఇంత ధర ఉంటే ఎవరు కొంటారు?అని అనుకోవచ్చు. కానీ ఈ పండ్లను కొటానికి పోటీ పడుతుంటారట.
ప్రత్యేక పద్ధతులతో పంట సాగు..
ఇంగ్లండ్ లోనే హెలిగాన్ గార్డెన్ లో పండింటే ఈ పండ్లకు మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ పైనాపిల్ పండు అన్ని పైనాపిల్ పండ్ల వంటివికాదు. ఒక్కసారి పంట వేస్తే పంట చేతికొచ్చేందుకు దాదాపు రెండు నుంచి మూడేళ్లు పడుతుందని హెలిగాన్ గార్డెన్ నిర్వాహకులు తెలిపారు. అందుకే ఇంత ధర..దీనిని తొలిసారిగా 1819లో బ్రిటన్ కు తీసుకొచ్చారు. అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. చెక్కతో చేసిన పెద్దపెద్ద కుండీలు ఏర్పాటు చేసి..అందులో సేంద్రీయ ఎరువులు నింపి, తగినంత ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు నిర్వాహకులు. అత్యంత జాగ్రత్తగా ప్రతీ రోజు కంటికి రెప్పలా చూసుకుంటుంటారు. దీంతో సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎలిజెబెత్-2కి గిఫ్టుగా ఇచ్చిన పైనాపిల్ పండ్లు..
ఈ పైనాపిల్ సాగు చేయాలంటే కూలీలు చాలామంది అవసరం ఉంటుంది. వారికి ప్రత్యేక జాగ్రత్తలు చెప్పి మరీ సాగులో కూలీలను పెడతారు. చంటిపిల్లను చూసినంత జాగ్రత్తగా ఈ పంటను చూసుకోవాల్సి ఉంటుంది. వీటికి తోడు ట్రాన్స్ పోర్టులో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.దీంతో రవాణా ఖర్చులు, పండ్ల స్టోరేజీ ఇలా అన్ని విషయాల్లోను అత్యంత జాగ్రత్తలు తీసుకుని లెక్క వేస్తే ఈ పండ్ల ధర పీక్స్ లో ఉంటుంది. ఇలా అన్నీ లెక్కవేస్తే ఒక్కో పండుని కనీసం రూ.లక్ష రూపాయలు (యూకే కరెన్సీలో 1000 పౌండ్స్) అమ్మితేనే పంటదారులకు గిట్టుబాటు అవుతుంది.
వేలంలో ఒక్కో పండు ధర రూ. 10 లక్షలు
మరి ఇన్ని జాగ్రత్తలతో పండే ఈ పంట ఆ రేంజ్ వారి కొంటారుగా..అందులోనే ప్రముఖులకు ఇటువంటి పండ్లను గిఫ్టుగా ఇస్తే దాని రేంజ్ మరింత పెరుగుతుంది. అందుకే ఈ హెలిగాన్ పైనాపిల్‌ను ఎలిజెబెత్-2 జీవించిన ఉన్న రోజుల్లో ఆమెకు బహుమతిగా ఇచ్చారట. ప్రస్తుతం రూ. 1లక్షకు విక్రయిస్తున్నామని.. ఒకవేళ వేలం పెడితే రూ. 10 లక్షల వరకు ధర పలకొచ్చని గార్డెన్ నిర్వాహకులు చెబుతున్నారు.