An An Passed Away : తిండి మానేసి..కన్నుమూసిన ప్రపంచంలోనే పెద్ద వయసుగల పాండా

ప్రపంచంలో అత్యంత పెద్ద వయసుకలిగిన మగ పాండా కన్నుమూసింది.ఈ భూమ్మీద మానవ సంరక్షణలో ఉన్న అత్యంత వయసుర్కాలైన మగ పాండా ఇదే.

World Oldest Male Panda An An Passed Away

World Oldest Male Panda An An Passed Away : ప్రపంచంలో అత్యంత పెద్ద వయసుకలిగిన మగ పాండా కన్నుమూసింది. హాంకాంగ్‌ ఓషన్‌ థీమ్‌ పార్క్‌లో 35 ఏళ్ల పాండా పేరు యాన్‌ యాన్‌. ఈ భూమ్మీద మానవ సంరక్షణలో ఉన్న అత్యంత వయసుర్కాలైన మగ పాండా ఇదే. అత్యంత సున్నితమైన జీవరాశి జాబితాలో పాండాకు చోటు ఉంది.

యాన్‌ యాన్‌ 1999 నుంచి ఈ పార్క్‌లో ఉంటోంది. కొన్ని రోజులుగా యాన్ 10రోజులుగా తిండి తక్కువగా తింటోంది. ఆరోగ్యంగానే ఉన్నా యాన్ ఎందుకు ఆహారం తినటంలేదోనని ..అది ఎందుకలా చేస్తుందో జూ నిర్వాహకులకు అర్థం కాలేదు. దీంతో ఆహారం తినకపోతే ఆరోగ్యం పాడవుతుందని ఆందోళన చెందిన జూ నిర్వాహకులు దానికి బలవంతంగా తినిపించే ప్రయత్నం చేసినా..తినేది కాదు. ఆ తరువాత దాని ఆరోగ్యం క్షీణించటం ప్రారంభించి రక్తపోటు కూడా పెరిగింది. దీంతో జూలో సందర్భనకు యాన్ కనిపించకుండాపోయింది. చివరకు యాన్ తిండి మానివేసి కన్నూమూసింది.

ఇంతకు ముందు అత్యధిక వయసున్న పాండాగా జియా జియా పేరిట రికార్డు ఉండేది. 38 ఏళ్ల వయసులో అది 2016లో కన్నుమూసింది. జియా జియా, యాన్‌ యాన్‌లను చైనా ప్రభుత్వం హాంకాంగ్‌ పార్క్‌కు కానుకగా ఇచ్చింది. పాండాల సంరక్షణకు మారుపేరుగా ఉన్న హాంకాంగ్‌లో.. వాటి జనాభా మాత్రం అంతగా వృద్ధి చెందడం లేదు. మరోవైపు చైనా నుంచే కానుకల రూపంలో వచ్చిన యింగ్‌ యింగ్‌, లే లే పాండాలతో సంతానోత్పత్తి చేయించాలన్న పదిహేనేళ్ల ప్రయత్నాలు ఫలించడం లేదు. మరి దీనికి కారణం ఏమిటో కూడా తెలియటంలేదంటున్నారు నిర్వాహకులు.

“యాన్ మరణం అనేక హృదయాన్ని కదిలించివేసిందని ఓషన్ పార్క్ కార్పొరేషన్ చైర్మన్ పాలో పాంగ్ తెలిపారు. యాన్ మాకు మధురమైన జ్ఞాపకాలను అందించింది అని..యాన్ చక్కటి తెలివితేటలుకలది అని..దాని చేష్టలు చక్కటి ఉల్లాసభరితంగా ఉండేవి అని గుర్తు చేసుకున్నారు. ఇకనుంచి యాన్ చిలిపి చేష్టలను చాలా మిస్ అవుతున్నామని అన్నారు.