World Vegetarian Day 2023
World Vegetarian Day 2023 : నాన్ వెజ్ తినేవారి కంటే వెజ్ తినేవారు ఎక్కువకాలం జీవిస్తారు అని కొన్ని నివేదికల్లో వెల్లడైంది. వీటిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. శాకాహారులుగా ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు మాత్రం ఉన్నాయి. చాలామంది ఇప్పుడు ఆకు కూరలు, కూరగాయలు తింటే మంచిదని భావిస్తున్నారు. అక్టోబర్ 1 న ‘ప్రపంచ శాకాహారుల దినోత్సవం’ (World Vegetarian Day) నిర్వహిస్తారు. అక్టోబర్ నెలను వెజిటేరియన్ అవేర్‌నెస్ మంత్‌గా జరుపుతారు. అసలు ‘వరల్డ్ వెజిటేరియన్ డే’ జరపడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకుందాం.
Detect Adulteration : కూరగాయలు, పండ్లలో కల్తీని గుర్తించటం ఎలాగో తెలుసా ?
ఏటా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 1 న ‘ప్రపంచ శాకాహార దినోత్సవం’ నిర్వహిస్తారు. శాకాహారం తినడం వల్లే కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రోత్సహించడంతో పాటు జంతు ఆధారిత ఉత్పత్తులను తీసుకోవడం తగ్గించమని సూచించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుతారు. ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని 1977 నార్త్ అమెరికన్ వెజిటేరియన్ సొసైటీ (NAVS) ప్రారంభించింది. 1978 లో ఇంటర్నేషనల్ వెజిటేరియన్ యూనియన్ అధికారికంగా ఈ రోజు ఆమోదించింది. ప్రపంచ వ్యాప్తంగా 180 కి పైగా దేశాలు ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్, థాయ్ లాండ్ దేశాల్లో ఈ దినోత్సవం జాతీయ గుర్తింపును కూడా పొందింది.
ప్రపంచ శాకాహార దినోత్సవం శాకాహార జీవన శైలిని అలవర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రోత్సహించడానికి వేదికగా పనిచేస్తుంది. జంతు ఉత్పత్తులను తగ్గించమని వ్యక్తులను ప్రోత్సహిస్తుంది. శాకాహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, డయాబెటీస్ కొన్ని రకాల క్యాన్సర్ వంటి ప్రమాదాలను ఎలా తగ్గించుకోవచ్చునో ఈ రోజు హైలైట్ చేస్తుంది. శాకాహారాన్ని ప్రోత్సహించడానికి ప్రచారాలు, ఈవెంట్లు వంటివి ఈరోజు నిర్వహిస్తారు.
Avoid Eating Raw Vegetables : ఈ నాలుగు రకాల కూరగాయలు, పండ్లు పచ్చిగా తినకూడదు తెలుసా ?
మాంసాహారంలోనే కాదు శాకాహారంలో కూడా విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. మాంసాహారం తినడంవల్ల పెరిగే చెడు కొలెస్ట్రాల్ వెజిటబుల్స్ తినేవారిలో ఉండదు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్‌లో శాకాహారుల కంటే మాంసాహారులలో చాలా త్వరగా వృద్ధాప్యపు ఛాయలు కనిపిస్తాయని పేర్కొంది. అంతేకాదు వ్యాధులు ప్రబలే ప్రమాదం కూడా ఉందని తెలిపింది. కొన్ని అధ్యయనాల ప్రకారం బరువు తగ్గాలనుకునేవారు శాకాహారాన్ని ఎంపిక చేసుకోవడం చాలా బెటర్ అట.