World’s Most Expensive Soap Costs Rs.2.07 Lakhs : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు. దీని ధర 2,800ల డాలర్లు. అంటే మన ఇండియా కరెన్సీలో రూ.2.07 లక్షలు!! అబ్బో..ఏం రేటండీ బాబూ వింటుంటునే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఏంటీ బంగారంతో తయారు చేశారా ఈ సబ్బుని అని వెటకారం ఆడొచ్చు. నిజమే మరి..ఈ సబ్బులో బంగారాన్ని ఉపయోగించారు. అంతేకాదు వజ్రాల పొడిని కూడా ఉపయోగించి తయారు చేశారు.అందుకే అంత ధర.
ఏంటేంటీ మరీ విడ్డూరంగా ఉందే సబ్బులో బంగారం..వజ్రాలను వాడారా? అని ఆశ్చర్యపోతున్నారు కదూ. నిజమే..ఈ సబ్బులో 17 గ్రాముల మేలిమి బంగారం, కొంత వజ్రాల పొడి కూడా ఉందని ఈ సబ్బు తయారు చేసిన బడేర్ హసన్ అండ్ సన్స్ వారు తెలిపారు. కానీ చూడటానికి ఈ సబ్బు బ్యూటీఫుల్ లుక్ లో ఉండదు.
ఏదో వాడి పడేసిన సబ్బులాగా..నాసిరకంగా సబ్బు కనిపిస్తుంది. బంగారం..వజ్రాలో తయారు చేసిన సబ్బు లుక్ ఎలా ఉండాలి? బంగారంలా మెరిసిపోవాలి..వజ్రాల సొగసుతో వెలిగిపోతున్నట్లుగా కనిపించాలి. కానీ దానికి భిన్నంగా పేలవంగా కనిపించే ఈ సబ్బు ‘లక్ష’ణమైన సోప్ అట.. అదేనండీ లక్షల ఖరీదైన సబ్బు.
https://10tv.in/uk-england-old-grandmother-who-survived-from-several-deadly-situations-celebrated-her-100th-birthday-on-2020/
వీటితోపాటు శరీరానికి ఎంతో మేలు చేసే అలీవ్ నూన్, ఆర్గానిక్ తేనె, ఖర్జూరం వంటివి కూడా వేసి తయారుచేశారట.. లెబనాన్‌లోని ట్రిపోలీకి చెందిన ఈ కుటుంబం హ్యాండ్ మేడ్ సోప్స్, ఖరీదైన సబ్బులు తయారుచేయడంలో పేరొందినవారు.
15వ శతాబ్దం నుంచీ వీళ్లు ఇదే బిజినెస్‌లో ఉన్నారు. దీన్ని ఈ మధ్య కొందరు ప్రముఖులకు బహుమతిగా ఇచ్చారు.. ఇచ్చినప్పుడు వారి పేరును బంగారంతో ఈ సబ్బుపై చెక్కించి మరీ ఇచ్చారట.. ఇది కొంత మందికే ప్రత్యేకమా.. లేక అందరూ దీన్ని కొనొచ్చా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.. కాగా ఈ సబ్బుని ఖతార్ ప్రథమ మహిళకు స్పెషల్ గిఫ్ట్ గా ఇచ్చారు.