‘World Oldest Jeans’: 165 ఏళ్లనాటి జీన్స్ ప్యాంట్..! ధర అక్షరాలా Rs.94 లక్షలు..!!

165 ఏళ్లనాటి ఓ జీన్స్ ప్యాంట్ ఈనాటికి చెక్కు చెదరకుండా ఉంది. ఈ జీన్స్ ధర అక్షరాలా Rs.94 లక్షలు..!! ఏంటీ షాక్ అయ్యారా?

‘World Oldest Jeans’: 165 ఏళ్లనాటి ఓ జీన్స్ ప్యాంట్ ఈనాటికి చెక్కు చెదరకుండా ఉంది. మాసిపోయినట్లుగా ఉంది కానీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం..ఇంతకంటే మరో విశేషం ఏమిటంటే 165 ఏళ్లనాటి ఈ మాసిపోయిన జీన్స్ ప్యాంట్ ధర వింటే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. ఈ మాసిపోయి నాచు పట్టేసి ఉన్న ఈ జీన్స్ ప్యాంట్ ధర అక్షరాలా Rs.94 లక్షలు..!! ఏంటీ షాక్ అయ్యారా? అవ్వకుండా ఎలా ఉంటాం ధర రేంజ్ అలా ఉంది మరి. ఇంతకీ ఈ జీన్స్ ప్యాంట్ వెనుక ఉన్న కథాకమామీషు ఏంటో తెలుసుకుని తీరాలను ఆసక్తి కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది 165 ఏళ్లనాటి ప్యాంట్ ..పైగా అంత పాత ప్యాంట్ ధర రూ.94 లక్షలు మరి ఇక దీని సంగతి తెలుసుకుని తీర్సాల్సిందే..

ఈ జీన్స్ ప్యాంట్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన జీన్స్ (లెవీ జీన్స్ జత ). 1857 కాలం నాటిది. ఈ ప్యాంట్ కు ఐదు బటన్స్ ఉన్నాయి. దాని ఒరిజినల్ కలర్ ఏమిటో గానీ ప్రస్తుతం ఇది తెలుపు రంగులో ఉంది. అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన ఓ షిప్ లో లభించింది.1857సెప్టెంబర్ లో పనామా నుంచి న్యూయార్క్ కు ప్రయాణిస్తున్న 425మంది వ్యక్తులతో ప్రయాణిస్తున్న ఓ నౌక హరికేన్‌లో మునిగిపోయినప్పుడు షిప్ ఆఫ్ గోల్డ్ అని పిలువబడే SS సెంట్రల్ అమెరికా నుండి జీన్స్ స్వాధీనం చేసుకున్నారు అని ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఒరెగాన్‌కు చెందిన మెక్సికన్-అమెరికన్ యుద్ధంలో అనుభవజ్ఞుడైన జాన్ డిమెంట్‌కు చెందిన ట్రంక్‌లో ప్యాంటు కనుగొనబడింది. ఈ ప్యాంట్ అసలు రంగు ఏమిటో కూడా తెలియటంలేదు.

1857 కాలం నాటిది కాబట్టి ఇది 165 ఏళ్లనాటిదన్నమాట. ఇది లెవీ స్ట్రాస్ కంపెనీ తయారు చేసిన జీన్స్ ప్యాంట్ అని కొంతమంది అంటున్నారు…కాదని మరికొందరు అంటున్నారు. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన,అత్యంత ప్రజాదరణ పొందిన జీన్స్ తయారీదారులలో ఒకరు లెవీ స్ట్రాస్ కంపెనీ. ఇంత పురాతనమైనది అయినా అది ఏమాత్రం చెక్కు చెదకుండా ఉండటం..అంత పురాతనమైనది కాబట్టే ఇంత డిమాండ్ రావటం విశేషం.

పురాతనమైనవి అంటే ఎప్పుడూ ఎక్కడైనా క్రేజే కదా..అందుకే ఈ ప్యాంట్ ను వేలం వేయగా ఈ రేంజ్ లో అమ్ముడైంది. అమెరికాలో జరిగిన ఓ వేలంలో ఈ పురాతన జీన్స్ ప్యాంట్ 1లక్షా 14,000 డాలర్లకు అంటే మన భారతీయ కరెన్సీలో రూ.94 లక్షలకు అమ్ముడైంది.

 

ట్రెండింగ్ వార్తలు