Nicole Oliveira: NASAతో 8 ఏళ్ల చిన్నారి..బొమ్మలతో ఆడుకునే వయస్సులో ‘ఆస్టరాయిడ్‌’ తో ఆటలు

బొమ్మలతో ఆడుకునే ఎనిమిదేళ్ల చిన్నారి నాసాతో కలిసి పనిచేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత స్పేస్‌ సైంటిస్ట్‌ గా పేరుపొందింది నికోల్ ఒలివేరా.

8  years Space‌ Scientist‌ Nicole Oliveira: 8 ఏళ్ల చిన్నారి..స్కూలుకు వెళ్లనని మారాం చేసే వయస్సు. బొమ్మలతో ఆడుకునే వయస్సు. కానీ ఓ 8ఏళ్ల చిచ్చరపిడుగు మాత్రం అంతరిక్షంలో తిరిగే ఆస్ట్రాయిడ్స్ తో ఆడుకుంటోంది.బుడి బుడి అడుగులు వేసే వయస్సప్పుడే చుక్కలు, చందమామలను తదేకంగా చూసేది. బహుశా అప్పుడు బహుశా ఆ చిట్టితల్లి అమ్మానాన్నలకుతెలీదు తమ బంగారుకొండ అంతరిక్షంతో ఆటలాకుంటుందని. ఎనిమిదేళ్లు వయస్సుసరికే 18 ఖగోళ వస్తువుల్ని గుర్తిస్తుందని. ఆ చిచ్చరపిడుగు పేరు నికోల్ ఒలివేరా. వయస్సు 8 ఏళ్లు. ఇంత చిరుప్రాయంలోనే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో కలిసి పనిచేస్తోంది.

Read more:World rabies day : రేబిస్ వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త లూయిస్‌ పాశ్చర్ గురించి విశేషాలు

ఎనిమిదేళ్లు వచ్చేసరికే నికోల్ అంతరిక్షంలో గ్రహశకలాల (ఆస్టరాయిడ్ల)ను గుర్తించే ‘ఇంటర్నేషనల్‌ ఆస్ట్రోనామికల్‌ సెర్చ్‌ కొలాబరేషన్‌’ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 18 ఖగోళ వస్తువుల (స్పేస్‌ ఆబ్జెక్ట్స్‌)ను గుర్తించింది కూడా. ఇంతటి ఘనత సాధించిన చిన్నారి ఆమెనే కావటం విశేషం. ప్రపంచంలోనే చిన్న వయసు ఆస్ట్రోనమర్‌గా నికోల్‌ నిలిచింది. బ్రెజిల్‌లోని ఫోర్టాలెజా ప్రాంతానికి చెందిన నికోల్‌ ఒలివెరాకు ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలు అంటే చాలా చాలా ఇష్టం. నికోల్ పెద్దయ్యాక ఏరోస్పేస్‌ ఇంజనీర్‌ అయి రాకెట్లను తయారు చేయాలని ఉందని చెబుతోంది ఈ చిన్నారి.

Read more : Nicole Oliviera : నాసా కోసం 7 గ్రహశకలాలు కనిపెట్టిన 7 ఏళ్ల బాలిక

నాసా విద్యార్థుల్లో సైన్స్‌ పట్ల ఆసక్తి కలిగించడం, వారే సొంతంగా కొత్త అంశాలను గుర్తించేలా ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థుల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నవారిని..స్కిల్స్ ఉన్నవారిని సెలక్ట్ చేసి ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేసింది. దీంట్లో నికోల్‌ ఒలివెరా ‘ఆస్టరాయిడ్‌ హంటర్‌’ బాధ్యతలకు ఎంపికైంది. రెండు పెద్ద స్క్రీన్లు ఉన్న కంప్యూటర్‌పై నాసా ఇచ్చే స్పేస్‌ మ్యాప్‌లను పరిశీలిస్తూ.. టెలిస్కోప్‌తో అంతరిక్షాన్ని జల్లెడపడుతూ.. 18 స్పేస్‌ ఆబ్జెక్ట్స్‌ను గుర్తించింది.

Read more : Typhus Vaccine : పేన్లతో ఏ వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేసారో తెలుసా??

నాసా శాస్త్రవేత్తలు వాటిని మరోసారి పరిశీలించి.. ఆస్టరాయిడ్లుగా సర్టిఫై చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి అయ్యాక ఆ ఆస్టరాయిడ్లకు బ్రెజిల్‌ శాస్త్రవేత్తల పేర్లు పెడతారట.

ట్రెండింగ్ వార్తలు