Nicole Oliviera : నాసా కోసం 7 గ్రహశకలాలు కనిపెట్టిన 7 ఏళ్ల బాలిక

అమ్మతో ఆడుకుంటూ నాన్నతో షికార్లు చేసే వయస్సులో ఓ చిన్నారి అంతరిక్షం, నక్షత్రాలు, గ్రహాలంటే ఇష్టమంటోంది. నాసా కోసం ఏడు గ్రహ శకలాలను కనిపెట్టింది నికోల్ ఒలివిరా అనే ఏడేళ్ల బాలిక. ఆకాశంలోని చందమామను చూస్తే అన్నంముద్దలు తీనే వయస్సులోనే అంతరిక్షం గురించి..గ్రహాల గురించి ప్రసంగాలు చేస్తూ విదేశాలలో ప్రసంగాలు కూడా చేస్తోంది.

Nicole Oliviera : నాసా కోసం 7 గ్రహశకలాలు కనిపెట్టిన 7 ఏళ్ల బాలిక

World Youngest Astronomer..7 Year Old Girl Nicole Oliviera (1)

World youngest astronomer..7 year old girl Nicole Oliviera : ఏడు ఏళ్ల చిన్నారులు అమ్మతో ఆడుకుంటారు. నాన్నతో షికార్లకు వెళుతూ గారాలుపోతారు. అమ్మ చందమామను చూపిస్తూ గోరుముద్దలు పెడుతుంటూ మారాం చేస్తూంటారు. కానీ ఏడేళ్ల చిన్నారి మాత్రం అంతరిక్షం, నక్షత్రాలు, గ్రహాలంటే ఇష్టమంటోంది. అంతేకాదు ఏడేళ్ల వయస్సున్న బాలిక ఎవ్వరూ ఊహించని విధంగా ఏడు గ్రహ శకలాలను కనిపెట్టింది. ఆ చిచ్చరపిడుగు పేరు నికోల్ ఒలివిరా. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌కి చెందినదీ చిన్నారి.చిన్న వయసులోనే అంతరిక్ష పరిశోధకురాలిగా మారి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కోసం 7 గ్రహశకలాల్ని కనిపెట్టింది. ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొల్లాబరేషన్..ఆమధ్య ఆస్టరాయిడ్ హంట్ అనే కార్యక్రమం ప్రారంభించింది. అది సిటిజన్ సైన్స్ ప్రోగ్రాం. ఇందులో ప్రజలు కూడా పాల్గొనవచ్చు. ఇందులో నాసాకి సభ్యత్వం ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారి 7 గ్రహశకలాల్ని గుర్తించి… నాసాకు సహాయం చేసి ఔరా అనిపించుకుంది. సర్టిఫికెట్ కూడా పొందింది.

చిన్నప్పుడు పిల్లలు రకరకాల బొమ్మలు అడుగుతారు. ఇంట్లో బామ్మలుంటే వారితో కథలు చెప్పించుకుని మురిసిపోతారు.కానీ ఈ ఏడేళ్ల పిడుగు మాత్రం చిన్నపిల్లల్లా బొమ్మలు అడగలేదు. అన్నం తినను అంటూ అమ్మను విసిగించనూ లేదు. రెండేళ్ల వయస్సున్న ఒలివిరాని వాళ్లమ్మ ‘‘నా బంగారు తల్లీ నీకేం కావాలమ్మా’ అని అడిగితే..ఆకాశంలో నక్షత్రాన్ని చూపించి… అది కావాలని అడిగిందట. దాంతో వాళ్లమ్మ… ఓ నక్షత్రం బొమ్మ కొని ఇచ్చిందట. ఇదేదో ఏదో సరదాగా చెప్పేది కాదు. నిజమే. దాంతో ఆ చిన్నారికి ఏం కావాలో ఆ తల్లికి అర్థమైపోయింది. ఇప్పుడీ ఏడేళ్ల పాప పలు స్కూళ్లలో ఆస్ట్రానమీ పై ఉపన్యాసాలు ఇస్తోంది. వింటేనే ఎంత ఆశ్చర్యమనిపిస్తోంది. కనీ వినీ ఎరుగని తెలివి ఈ చిన్నారిది అనిపిస్తోంది. మహా మహుల్నే ఆశ్చర్యపడేలా చేస్తోంది.

బ్రెజిల్ ప్రభుత్వంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ చిన్నారి ఒలివిరాను తమ దేశానికి రమ్మని ఆహ్వానించింది. తమ దేశంలో జరిగిన మొదటి ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ అండ్ ఏరోనాటిక్స్ సెమినార్‌లో మాట్లాడాలని కోరింది. నికోలాకి ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అందులో రోదసిపై అవగాహన వీడియోలు పెడుతూంటుంది. అలాగే గ్రహశకలాలు, అంతరిక్షం, నక్షత్రాల గురించి ఎన్నో విషయాలు చెబుతుంటుంది. అంతేనా..ఖగోళ శాస్త్రంలో తలపండిన శాస్త్రవేత్తలతో మాట్లాడి వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంటుంది. ఇలా ఈ ఏడేళ్ల చిన్నారి ఆలోచనలు, మాటలు, ప్రసంగాలు అన్నీ రోదసికి చెందినవే చేస్తుంది. ఎక్కడన్నా చూశామా? ఇంత చిన్న వయస్సులోనే రోదసిని అవపోసన పట్టేసి చిచ్చరపిడుగు గురించి..