World rabies day : రేబిస్ వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త లూయిస్‌ పాశ్చర్ గురించి విశేషాలు

వరల్డ్‌ రెబీస్‌ డే కుక్క కాటుకు చెప్పు దెబ్బే మందు అనే రోజులు చెక్ పెట్టి రాబిస్ వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ గుర్తుగా ఈరోజును జరుపుకుంటాం.

10TV Telugu News

world rabies day2021  : సెప్టెంబర్  28. వరల్డ్‌ రెబీస్‌ డే( world rabies day). కుక్క కాటుకు చెప్పు దెబ్బే మందు అనే రోజులు చెక్ పెట్టారు ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్. రెబీస్‌కు వ్యతిరేకంగా మొదటిసారి టీకా vaccine ను కనిపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్‌ పాశ్చర్‌. ఈయనకు గుర్తుగానే ఈ రాబిస్ డేను నిర్వహిస్తారు. రెబీస్‌ కుక్కలు మనుషులకు కరిస్తే అది కుక్కల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ను లిసా వైరస్‌ అని అంటారు.

వరల్డ్‌ రెబీస్‌ డే సందర్భంగా ఈ వ్యాధి ఎలా వస్తుంది, లక్షణాలేంటి నివారణకు ఏం చెయ్యాలో ప్రపంచ దేశాలు ప్రజలకు వివరిస్తాయి. యాజ్ యూజువల్‌గా స్కూళ్లలో కూడా పిల్లలకు ఈ విషయాలు చెబుతారు. 2007 నుంచి ఏటా రేబిస్ దినం జరుపుతున్నారు. ఐక్యరాజ్యసమితిలో ప్రధాన కార్యాలయం ఉన్న గ్లోబల్ అలియాన్స్ ఫర్ రేబిస్ కంట్రోల్ అనే స్వచ్ఛంద సంస్థ… ఏటా ప్రపంచ రేబిస్ దినం జరుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 59వేల మంది రేబిస్ వ్యాధి వల్ల చనిపోతున్నారని లెక్కలు చెబుతున్నారు. ఈ మరణాల్లో 95 శాతం ఆసియా, ఆఫ్రికాలోనే జరుగుతున్నాయి.

Read more : Typhus Vaccine : పేన్లతో ఏ వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేసారో తెలుసా?

రాబిస్ కు టీకా వ్యాక్సిన్ కనిపెట్టని లూయిస్ పాశ్చర్ ప్రముఖ ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త. 1822 డిసెంబర్ 27న ఫ్రాన్స్ లోని డోల్ గ్రామంలో పుట్టిన ఈయన పలు వ్యాధులకు కారణమవుతున్న సూక్ష్మజీవులను కనుగొని వాటి ద్వారా వచ్చే వ్యాధుల నివారణకు టీకాలు కనిపెట్టారు.ముఖ్యంగా కుక్కల నుంచి వ్యాపించే రేబిస్ వ్యాధికి టీకా వ్యాక్సిన్ కనుగొన్నారు.

తండ్రి జీన్ పాశ్చర్ తోలు వ్యాపారం చేసి జీవించేవారు. చిత్రలేఖనంలో మంచి ప్రతిభ కనపరిచేవారు. తల్లిదండ్రులతో పాటు ఇరుగుపొరుగు వారివి, స్నేహితులవి బొమ్మలు పెయింట్ చేసేవారు. ఆయన వేసిన పలు చిత్రాలు ఇప్పటికీ పాశ్చర్ మ్యూజియంలో ఉన్నాయి. గణితం, భౌతిక, రసాయనిక శాస్త్రాలంటే ఇష్టమున్న పాశ్చర్ ఉపాధ్యాయ జీవితాన్ని గడపాలనుకొనేవారు. 16 ఏళ్ల వయసులో కాలేజీ చదువు కోసం పారిస్ లో అడుగుపెట్టాడు. డాక్టరేట్ పూర్తిచేసి 1848లో స్ట్రాస్ బర్గ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ కు వారి అమ్మాయి మేరీ లారెంట్ ను పెళ్ళిచేసుకుంటానని అనుమతికోసం లేఖ రాశాడు. 1849 మే 29న వీరిద్దరు పెళ్ళిచేసుకున్నారు. ఆదర్శదంపతుల్లాగా జీవించారు. వీరికి అయిదుగురు పిల్లలు పుట్టినా ముగ్గురు మరణించారు.టైఫాయిడ్ వల్ల ఇద్దరు, మశూచి వల్ల ఒక బిడ్డను పోగొట్టుకొన్నారు.సెప్టెంబర్ 28 1895లో లూయిస్ మరణం తరువాత ఆయన్ని పారిస్ లోని పాశ్చర్ సంస్థ భూగర్భంలో ఖననం చేశారు. ఈ ఘనత దక్కిన 300 మంది ఫాన్స్ దేశస్తులలో లూయిస్ ఒకరు.

Rean more : US Marine: అమెరికా 250 ఏళ్ల చరిత్రలో మొదటిసారి..సిక్కు మెరైన్‌కు తలపాగా ధరించే అవకాశం..

కుక్కలతో జాగ్రత్త..
రాబిస్ వైరస్ ఉన్న కుక్కలు మనుషులకు కరచినప్పుడు అది వ్యాపిస్తుంది. ముఖ్యంగా మన శరీరంపై గాయాలు ఉన్నపుడు..గాయాల్ని కుక్కలు నాకినా మన శరీరంలోకి ఈ వైరస్‌ ప్రవేశిస్తుంది. కేవలం కుక్కల నుంచే కాకుండా మిగతా జంతువుల నుంచి కూడా రెబీస్‌ సోకే ప్రమాదం ఉంది. ఈ వైరస్ మిగతా జంతువల కంటే కుక్కలనుంచే అంటే 99 శాతం కుక్క ద్వారా మాత్రమే సోకుతుంది. కానీ ఇది రాబిస్ ఉన్న కుక్కలు కరిస్తే మాత్రమే వస్తుంది.

రాబిస్ వైరస్ ఉన్న కుక్కలు కరిస్తే ఆ వైరస్‌ నాడులను చేరుకుని గంటకు మూడు మిల్లీలీటర్లకు చేరుకుని వ్యాపిస్తుంది. పెంపుడు కుక్కల కంటే వీధి కుక్కలకు రెబీస్‌ వ్యాధి ఎక్కువగా ఉండే అవకా ఉంటుంది. ఎందుకంటే పెంపుడు కుక్కలకు యజమానులు ఎప్పటికప్పుడు ఈ వైరస్ రాకుండా టీకాలు వేయిస్తుంటారు. దీంతో పెంపుడు కుక్కల కంటే వీధి కుక్కలకే ఈ వైరస్ ఉండే అవశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరస్ మనిషి శరీరంలోకి వ్యాపిస్తే అది నాడులమీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో సదరు బాధితుడు 2–3 వారాల్లో చనిపోయే ప్రమాదం ఉంటుంది. దీనికి నివారణే గాబరగా ఉండటం, భయంకరమైన చూపు, నోటి నుంచి లాలాజలం కారడం. అంటే చొంగ కారటం వంటివి ఉంటాయి.

కుక్క కరిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
గొంతులోని అవయవాలు పెరాలిసిస్‌ బారిన పడతాయి. కాబట్టి అవి పనిచేయవు. కుక్క కాటు జరిగితే వెంటనే టీకా తీసుకోవాలి. కాటు అయిన గాయాలను వెంటనే శుభ్రం చేసి వెంటనే టీకా వేయించాలి. ముఖ్యంగా యాంటీ రెబీస్‌ టీకా తీసుకోవాలి.కుక్క కరవగానే సబ్బుతో వెంటనే కడగాలి. అవకాశం ఉంటే అయోడిన్‌ సొల్యూషన్‌ వేసి కడగాలి. ఇది చేస్తే 90 శాతం రెబీస్‌ బారిన పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది.

చేయకూడనివి..
కానీ కుక్కకాటు గాయాన్ని శుభ్రం చేయటం ముఖ్యం అన్నాం కదాని చాలామంది ఆ గాయంపై యాసిడ్‌ పోస్తుంటారు. అలా అస్సలు చేయకూడదు. అలా చేస్తే..ఉపయోగం కంటే నష్టాలే ఎక్కువ. గాయాన్ని నేరుగా మన చేతులతో కడగకూడదు. దేనితోనైనా నీరు పోయారు. రాబిస్ వ్యాధిన పడినవారికి హైడ్రోఫోబియా వస్తుంది. అంటే నీళ్లు చూస్తే భయపడిపోతారు.గాయం పెద్దగా ఉన్నా..రక్త కారుతోందికదాన్ని దాన్ని ఆపకూడదు.. కుట్లు వేయకూడదు. అవసరమైతేనే వేయాలి.

చేయాల్సినవి..
యాంటీ సెప్టిక్‌ లోషన్‌ రాయాలి. ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజెక్షన్, గాయం మానడానికి యాంటీ బయోటిక్స్‌ వంటివి తీసుకోవాలి. యాంటీ రెబీస్‌ వ్యాక్సిన్‌ చేతిపై చేయించుకోవాలి. ఐవీ ఇమ్యూనో వ్యాక్సిన్‌ తీసుకోవాలి. ఇవి పరిస్థితిని బట్టి డోసులు ఇస్తారు. కుక్కకాటు రాకముందే వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. దీన్ని ప్రీ ఎక్స్‌పోజర్‌ ప్రొఫ్లాక్సెస్‌ అంటారు.

కుక్కకాటు తర్వాత తీసుకునే టీకాను పోస్ట్‌ ఎక్స్‌పోజర్‌ అంటారు. రాబీపుర్‌ చిక్‌ వంటి టీకా ఇస్తారు. దీన్ని బొడ్డు చుట్టు ఇవ్వాల్సిన అవసరం లేదు. చేతులకు లేదా నడుముకు ఇస్తారు. ఇంట్లో పెంచుకునే కుక్కలకు సమయాన్ని అనుసరించి వ్యాక్సిన్స్‌ వేస్తారు కాబట్టి వీటితో భయపడాల్సిన అవసరం లేదు. ఇది సోకిన 3–4 రోజుల్లో లక్షణాలు తెలిసిపోతుంది.