Jayakrishna Ghattamaneni : మహేష్ బాబు కొడుకు హీరోగా సినిమా అనౌన్స్.. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
మహేష్ కి కొడుకు వరస అయ్యే జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. (Jayakrishna Ghattamaneni)
Jayakrishna Ghattamaneni
Jayakrishna Ghattamaneni : ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ తర్వాత చాలా మంది సినీ పరిశ్రమలోకి వచ్చారు. మహేష్ బాబు ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. మహేష్ తనయుడు గౌతమ్ ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ లోపే మహేష్ కి కొడుకు వరస అయ్యే జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మహేష్ అన్నయ్య రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.(Jayakrishna Ghattamaneni)
కృష్ణ మనవడు, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నేడు సినిమాని ప్రకటించారు. సీనియర్ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ సమర్పణలో P కిరణ్ నిర్మాణంలో చందమామ కథలు పిక్చర్స్ అనే కొత్త నిర్మాణ సంస్థ లో మంగళవారం, RX100 లాంటి రా & రస్టిక్ సినిమాల దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమాని ప్రకటించారు.
ఈ సినిమాని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో బ్యాక్ గ్రౌండ్ లో తిరుపతి విజువల్స్ ఉండటంతో ఈ సినిమా తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తుంది. మరి మహేష్ కొడుకు వరస అయ్యే జయకృష్ణ హీరోగా ఎలా మెప్పిస్తాడో చూడాలి. జయకృష్ణ తండ్రి రమేష్ బాబు కూడా గతంలో హీరోగా సినిమాలు చేయగా ఆయన 2022 లో మరణించారు.

Also Read : Anupama Parameswaran : పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అనుపమ.. తీరా చూస్తే 20 ఏళ్ళ అమ్మాయి.. హీరోయిన్ పోస్ట్ వైరల్..
