US Marine: అమెరికా 250 ఏళ్ల చరిత్రలో మొదటిసారి..సిక్కు మెరైన్‌కు తలపాగా ధరించే అవకాశం..

అమెరికా మెరైన్‌ దళంలోకి ఎంపికైన సిక్కు యువకుడి డ్యూటీలో తలపాగా ధరించి పాల్గొనటానికి అనుమతి లభించింది. యూఎస్ మెరైన్‌ 246 ఏళ్ల చరిత్రలో సిక్కులకు ఇలాంటి అవకాశం దక్కడం మొదటిసారి.

US Marine: అమెరికా 250 ఏళ్ల చరిత్రలో మొదటిసారి..సిక్కు మెరైన్‌కు తలపాగా ధరించే అవకాశం..

Us Marines Turban

Sikh Officer In US Marines, Allowed to Wear Turban : ఏ దేశమేగినా ఎందుకాలిడినా భారతీయులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం మరచిపోరు..విడిచిపెట్టరు. విదేశాలలో సెటిల్ అయి ఉన్నతస్థాయిలోకి చేరుకున్నా సరే వారి మూలాలను ఏమాత్రం వదలరు. తాతలు తండ్రులు వారసత్వాన్ని నిలబెడతారు. విదేశాలలో స్థిరపడి ఆయా దేశాల్లో ఉన్నతస్థాయికి చేరారు ఎంతోమంది భారతీయులు. అలా అమెరికా భద్రతాదళంలో సబ్ మెరైన్ లెఫ్టినెంట్ స్థాయికి చేరుకున్నారు భారత్ నుంచి వలస వచ్చిన అమెరికాలో స్థిరపడిన సిక్కు యువకుడు సుఖ్ బీర్.

సిక్కులు అంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది వారి ఆహార్యంలోని ‘తలపాగా’ చాలా ఆకర్షణీయంగా..అందంగా..హుందాగా ఉంటుంది సిక్కులు ధరించే తలపాగా. ఆ తలపాగాయే సుఖ్ వీర్ కు మెరైన్ లెఫ్ట్ నెంట్ డ్యూటీలో సమస్య అయ్యింది. సాధారణ డ్యూటీలో ఉండగా తలపాగా ధరించవచ్చు గానీ..అదే ఘర్షణాత్మకమైన అంటే సీరియస్ కండిషన్ కావచ్చు..ఇతర దేశాలపై జరిగే దాడుల విషయంలో కావచ్చు ఇలా కొన్ని సందర్భాల్లో సుఖ్ వీర్ తలపాగా ధరించవద్దనే సూచనలు వచ్చాయి. దీంతో పరిమితులు విధిస్తే కోర్టుకెళతానని 26 ఏళ్ల అమెరికా మెరైన్ ఫస్ట్‌ లెఫ్టినెంట్‌ సుఖ్‌బీర్‌ తెలిపారు.

Read more : Same Sex Marri : స్వలింగ సంపర్కుల వివాహాలకు గ్రీన్ సిగ్నల్..కేరింతలు కొడుతున్న జనాలు

ఈక్రమంలో సుఖ్ వీర్ కు తలపాగా ధరించి విధుల్లో పాల్గొనేందుకు అనుమతి లభించింది. ఎంతో పేరున్న అమెరికా మెరైన్‌ 246 ఏళ్ల చరిత్రలో కొన్ని పరిమితులతో సిక్కులకు ఇలాంటి అవకాశం దక్కడం ఇదే తొలిసారి కావటం విశేషం.కాగా..సుఖ్ వీర్ కాలేజీ చదువు పూర్తయ్యాక 2017లో మెరైన్స్‌లో చేరారు. ఫస్ట్‌ లెఫ్టినెంట్‌ స్థాయి నుంచి త్వరలోనే కెప్టెన్‌గా ప్రమోషన్‌ అందుతుందని సుఖ్‌బీర్‌ సింగ్‌ న్యూయార్క్‌టైమ్స్‌కిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రమోషన్ వచ్చాక తమ మత సంబంధ చిహ్నాలను ధరించడంపై పరిమితులు ఎత్తివేయాలని కోరుతు కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.

Read more :China Virgin Boy Egg : ‘మూత్రం’తో ఉడికించిన గుడ్లు..లొట్టలేసుకుంటు తినేస్తున్న చైనీయులు

భారత్‌ నుంచి వలస వచ్చిన సిక్కు కుటుంబానికి చెందిన సుఖ్‌బీర్‌కు కొన్ని పరిమితులతో తలపాగా ధరించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ‘సాధారణ విధుల్లో’ ఉండగా ఆయన తలపాగా ధరించవచ్చు. కానీ, ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించినప్పుడు ఆయన తలపాగా ధరిస్తే ఇతరులు (శత్రుదేశస్తులు)గుర్తుపడతారు’అని మెరైన్‌వర్గాలు అంటున్నాయి.

Read more : Insect Menu : చీమ‌లతో ఐస్‌క్రీమ్‌,చెదపురుగుల ప‌చ్చ‌ళ్లు..బొద్దింకల ఫ్రై..తింటే ఎన్నో లాభాలు !!

మఖ్యంగా యుద్ధం జరిగే సమయాల్లో ఆయన తలపాగా ధరిస్తే ప్రత్యర్ధులు చాలా ఈజీగా ఆయన్న గుర్తు పట్టవచ్చని అది ప్రమాదమని మెరైన్ వర్గాల భావన. యుద్ధ సమయాల్లో ఉన్నప్పుడు సభ్యుల మధ్య బలమైన టీం స్పిరిట్‌కు ఏకరూపకత (యూనిఫారం) అవసరమని అంటున్నాయి. దీనిపై సుఖ్‌బీర్‌ చేసిన వినతిని మెరైన ఉన్నత వర్గాలు తిరస్కరించాయి. దీంతో సుఖ్ వీర్ కోర్టుకు వెళతానని చెప్పటంతో అనుమతి కల్పించినట్లుగా తెలుస్తోంది. కాగా.. అమెరికా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లలో సిక్కులు సుమారు 100 మంది ఉండగా, వారంతా తలపాగా ధరించేందుకు, జట్టు పెంచుకోవటానికి అనుమతి ఉంది. వారు అలాగే ఉన్నారు. డ్యూటీ చేస్తున్నారు.