Insect Menu : చీమ‌లతో ఐస్‌క్రీమ్‌,చెదపురుగుల ప‌చ్చ‌ళ్లు..బొద్దింకల ఫ్రై..తింటే ఎన్నో లాభాలు !!

ఛీ..యాక్ అనే పురుగులే రాబోయే కాలంలో మనిషికి ఆహారంగా మారనున్నాయి..చీమ‌లతో ఐస్‌క్రీమ్‌,చెదపురుగుల ప‌చ్చ‌ళ్లు..బొద్దింకల ఫ్రైలు తింటే ఎన్నో లాభాలోనంటున్నారు నిపుణులు..

Insect Menu : చీమ‌లతో ఐస్‌క్రీమ్‌,చెదపురుగుల ప‌చ్చ‌ళ్లు..బొద్దింకల ఫ్రై..తింటే ఎన్నో లాభాలు !!

Insects Menu (1)

Insect menu..Full demand for Variety Food.. : ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది భిన్నమైన ఆహారాలు తింటుంటారు. మనం చేపలు, మాంసం, రొయ్యలు, పీతలు వంటి పలు మాంసాహాలు తింటుంటాం. అదే చైనీయులైతే పాములు, కప్పలు, పురుగులు ఇష్టంగా లొట్టలేసుకుని తింటారు. కానీ మన భారతదేశంలో పలు సంప్రదాయం సంస్కృల మేళవింపుగా ఎలా ఉంటుందో ఆహారపు అలవాట్లు కూడా అలాగే ఉంటాయి. ముఖ్యంగా భారతదేశపు గిరిజన, ఆదివాసీలు తినే ఆహారాలు చాలా వెరైటీగా ఉంటాయి. అలాగే చక్కటి బలవర్థకమైనవిగా ఉంటాయి. అటువంటివే ఎర్రచీమలతో పచ్చడి..అది కూడా చీమల లార్వాతో గిరిజనులు కలంలో వేసి నూరి చేసిన పచ్చడికి విదేశీలు కూడా ఫిదా అయిపోయిన సందర్భాలున్నాయి.

మన గిరిజనులు చేసిన చీమల పచ్చడి కోసం అంతర్జాతీయంగా పేరు పొందిన చెఫ్ లు కూడా విదేశాలనుంచి వచ్చి తింటారంటే అతిశయోక్తి కాదు. అంతర్జాతీయ చెఫ్ గా పేరు పొందిన Gordan ramsay ఎర్ర చీమల పచ్చడి తినటానికి ఎక్కడో మారుమూల ప్రాంతంలో నివసించే గిరిజనుల ఇంటికి వెళ్లి మరీ తిన్నారు.వావ్..ఎంత బాగుందో అంటూ గితాబు ఇచ్చారు. దాన్ని ఎలా చేస్తారో అడిగి మరీ తెలుసుకుని ఇటువంటి టేస్ట్ నేను ఎక్కడా చూడలేదంటూ గిరిజల క్రియేటివిటీకి ఫిదా అయిపోయారు Gordon ramsay.

Read more : Red Ant Chutney : కరోనాకు నివారణగా ఎర్రచీమల చట్నీ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

చీమలు ఎంతో బల వర్ధకమైన ఆహారమని అంటున్నారు కీటకాల వంటకంపై తన టీమ్ తో కలిసి పరిశోధనలు చేస్తున్న బెంగళూరుకు చెందిన సైంటిస్టు తన్షా వోహ్రా. కానీ ప్రకృతిలో పుట్టి పెరిగిన గిరిజనులకు ఏది బలవర్థకమైన ఆహారమో తెలుసు. అలా ఏజెన్సీ జిల్లాల్లోని కోయ, గోండు, కొండరెడ్లు, సుగాలి, కోలం, నాయక్‌పోడ్‌, అంధ్‌ వంటి గిరిజన-ఆదివాసీ తెగలు చీమల్ని ఆహారంగా తింటారు. జార్ఖండ్‌లోని కోడా ఆదివాసీలైతే ఆరేడు తరాలనుంచీ బెమౌట్‌ చీమలను లొట్టలేసుకుంటు తినేస్తారు. ముఖ్యంగా వారు స్వయంగా తయారు చేసుకున్న మద్యానికి సైడ్ డిష్ గా ఈ ఎర్రచీమల పచ్చడిని నంజుకుని తింటుంటారు.

వంటల్లో..రెండు వేలకుపైగా..కీటకాలు
ప్రజల్లో ఆధునికత పెరిగేకొద్దీ కొన్నికొన్ని ఆహారాలు, అలవాట్లలో పెనుమార్పులు వస్తున్నాయి. వాటితో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. కానీ ఈ కరోనా కాలంలో ఇమ్యూనిటీ ఫుడ్ అని పల్లె పట్టణ ప్రాంతాల ప్రజలు ఎగబడుతుంటే..గిరిజనులు మాత్రం ఎప్పుడు ఇమ్యూనిటీ ఆహారాలనే ఎక్కువగా తింటుంటారు. దీంతో పట్టణవాసులకంటే వారే ఆరోగ్యంగా ఉంటుంటారు. కీటకాలను తినే అలవాటు గిరిజనులకు తరాల నుంచీ ఉంది. తేనెటీగలు, కందిరీగలు, చీమలు, మిడతలు, ఉప్పు మిడతలు, తూనీగలు, చెద పురుగులు వంటివాటిని ఒకప్పుడు లొట్టలేసుకొని తినేవారు. ఈనాటికి చాలామంది గిరిజనులు తింటుంటారు.

మన పూర్వీకుల మెనూలో రెండు వేలకుపైగా కీటకాలుండేవట.ప్రస్తుతం, ఆ సంఖ్య ఐదొందలకు పడిపోయింది. అంటే వాటిని తినేవారు చాలా తక్కువ కీటకాలకు తింటున్నారు. ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో ఖర్జూర పురుగుల లార్వా నుంచి అద్భుతమైన వంటకాన్ని చేస్తారు. అస్సాంలో ఎర్రచీమల లార్వాతోనూ పచ్చళ్లు పెడతారు. మన దేశంలో దాదాపు 10 రాష్ర్టాలలో 300 పైచిలుకు కీటకాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. వారిలో ఎక్కువమంది గిరిజనలే కావటం గమనించాల్సిన విషయం.

Read more : బాబోయ్ : ఎర్ర చీమలతో పచ్చడి చేసుకుని తింటున్నారు

కీటకాల వంటలతో ప్రయోజనాలు..
చీమలు, ఇతర కీటకాల వంటల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు నిపుణులు. బస్తర్‌ ఆదివాసీలు వండుకొనే చీమల చట్నీలో, ఈత పురుగుల కూరలో పోషక విలువలు అపారం అని చెబుతున్నారు. వర్షాకాలంలో వచ్చే రోగాలను తట్టుకోవడానికి ఈ కీటకాలతో చేసిన ఆహారం మంచి బలవర్ధకమని చెబుతున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసీలు ఆరగించే ‘చాప్‌ డా’ అనే చీమల చట్నీ రోగ నిరోధక శక్తిని పెంచుతుందట. ఈ విషయం తెలిసుకున్న కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు మార్కెట్‌లో చాప్ డా అమ్ముతూ లాభాలు పొందుతున్నాయి.చీమల పచ్చడి తింటే జ్వరం, జలుబు లాంటివి దరిచేరవట. ఎర్రచీమల్లో ఔషధ గుణాలు కలిగిన ఫార్మిక్‌ యాసిడ్‌, ప్రొటీన్లు, క్యాల్షియం ఉండటం వల్ల మలేరియా, కామెర్ల చికిత్సలో దీన్ని వినియోగిస్తారు.అయితే ‘మిగతా కీటకాలతో పాటు చీమలలోనూ మానవ శరీరానికి హాని కలిగించే పదార్థం ఏదైనా ఉందా? అనే కోణంలోనూ పరిశోధన చేయాల్సి అవసరం ఉంది’ అంటున్నారు ప్రముఖ పరిశోధకులు తన్షా వోహ్రా. ఆ వైపుగానూ అధ్యయనానికి రెడీ అవుతున్నారామె.

కీటకాలను తినండి..ఇమ్యునిటీని పెంచుకోమని చెబుతున్న ఐక్యరాజ్య సమితి
కీటకాల ఆహారం తినమని సాక్షాత్తు ఐక్యరాజ్య సమితే చెబుతోంది. దీనికి కారణమేమంటే..ప్రకృతి విపత్తులతోను..పెరుగుతున్న కాలుష్యంతో ముంచుకొస్తున్న ఆహార కొరతే. ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ నివేదిక ప్రకారం..ఏమాత్రం పనికిరావని భావించే కీటకాలే ఆహార సంక్షోభం నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించబోతున్నాయని చెబుతోంది. అంటే ఆధునికత పేరుతో ఆహారపు అలవాట్లను మార్చుకున్న మానవుడు తిరిగి ఆనాటి ఆహారాలపైనే ఆధారపడనున్నాడన్నమాట.

Read more : Telangana Assembly : ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయి రాష్ట్రాభివృద్ధి కోసమే : మంత్రి కేటీఆర్

2023 చివరి నాటికి తినదగిన కీటకాల ప్రపంచ మార్కెట్‌ 2 బిలియన్‌ డాలర్లకు చేరుకోనుందని అంచనాలు వేస్తున్నారు నిపుణఉలు. కీటకాలతో రకరకాల వంటకాలను వండి వడ్డిస్తున్నారు చేయి తిరిగిన షెఫ్‌లు. మావెరిక్‌ అనే వంట నిపుణుడు ఏకంగా బతికున్న చీమలతో టేస్టీ టేస్టీ ఐస్‌క్రీమ్‌ తయారు చేస్తున్నాడు. అమెరికాలో ఉప్పు మిడతల ప్రొటీన్‌ బార్‌లు వెరీ పాపులర్‌ అయ్యాయి. అంతేకాదు బొద్దింకల పాలతో చేసిన ఆహారాలను ఎగబడి మరీ తింటారు కొన్ని దేశాల్లో.ఇటువంటి కీటకాల డిష్ లు వెరీ వెరీ స్పెషల్ డిష్ లుగా తింటున్నారు పలు దేశాల్లో.