Telangana Assembly : ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయి రాష్ట్రాభివృద్ధి కోసమే : మంత్రి కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతు..ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయి రాష్ట్ర అభివృద్ధి కోసమేనని స్పష్టంచేశారు.

Telangana Assembly : ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయి రాష్ట్రాభివృద్ధి కోసమే : మంత్రి కేటీఆర్

Minister Ktr

minister ktr Speaking in the Telangana Assembly : టీఆరెస్ ప్రభుత్వం ఏ ప్రోగ్రాం అయినా ప్రణాళిక బద్దంగా తీసుకుంటుందనీ..తీసుకున్న కార్యక్రమాలను పక్కా ప్రణాళితకతో అమలు చేస్తుందని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతు పలు అభివృద్దికార్యక్రమాలు విడతల వారీగా అమలు చేస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయి రాష్ట్ర అభివృద్ధి కోసమేనని కేటీఆర్ స్పష్టంచేశారు.

Read more : KTR-Revanth : రేవంత్‌పై కేటీఆర్ పరువు నష్టం దావా

మహా నగరమైన హైదరాబాద్ లో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారిందని..నగరంలో మోతాదుగుకు మించి మించి వాహనాలు ఉన్నానీ కాబట్టి ట్రాఫిక్ సమస్య పెద్దగా ఉందని కానీ దాన్ని కూడా పరిష్కరించటానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీంట్లో భాగంగా ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం 2వేల కోట్లతో మొదటి దశలో 22 ఫ్లైఓవర్ లు పూర్తి చేసామని అలాగే గ్రేటర్ శివారు ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని.. ఒక్క ఎల్బీనగర్ పరిధిలో 850 కోట్లతో నాలా అభివృద్ధి పనులు జరగనున్నాయి తెలిపారు.ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయి రాష్ట్ర అభివృద్ధి కోసమేనని కేటీఆర్ స్పష్టంచేశారు. హైదరాబాద్ లోని ప్రతి లొకేషన్ కి ఫ్లైఓవర్- లింక్ రోడ్ తో అనుసంధానంగా ఉందని తెలిపారు.

Read more : KTR Twitter : బుడ్డోడి ఆత్మవిశ్వాసానికి మంత్రి కేటీఆర్ ఫిదా.. వీడియో వైరల్

రాష్ట్రంలో 3 జ‌న‌ప‌నార మిల్లులు ఏర్పాటుకు ఒప్పందం : మంత్రి కేటీఆర్
అలాగే..తెలంగాణలో జ‌న‌ప‌నార మిల్లును ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీల‌తో ప్ర‌భుత్వం అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకున్నామని కేటీఆర్ తెలిపారు. జ‌న‌ప‌నార ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేసేందుకు ఆయా కంపెనీల‌కు ప్ర‌భుత్వం ప్రోత్సాహ‌కం క‌ల్పిస్తోందనీ..రెండు వ‌రి పంట‌ల మ‌ధ్య‌న మూడో పంట‌గా జ‌నుము పంట‌ను పండిచేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం వీలు కల్పిస్తోందని తెలిపారు.

వ‌రి ధాన్యం ఉత్ప‌త్తిలో దేశంలోనే తెలంగాణ అగ్ర‌భాగాన ఉందని..రైతుల‌కు ఇబ్బంది ఉండకూడదనే ఉద్ధేశ్యంలో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వ‌రి ధాన్యం సేక‌రించాంని వెల్లడించారు. బెంగాల్, బంగ్లాదేశ్‌లో జ్యూట్ మిల్స్ మూత‌ప‌డ్డాయి. గొనే సంచుల‌కు విప‌రీత‌మైన కొర‌త వ‌చ్చింది దీంతో కానీ స‌రిప‌డ గోనె సంచులు లేక ఇబ్బంది ప‌డ్డామని తెలిపారు. ఈ సమస్యలపై సీఎం కేసీఆర్ ఈ సమస్యల కోసం మనం వేరే దిశగా ఆధారపడే కంటే మనమే మన రాష్ట్రంలోనే గోనె సంచుల‌ను ఉత్ప‌త్తి చేసే దిశ‌గా ఆలోచించాల‌ని సూచించారని..రాయితీలు ఇచ్చి పెట్టుబ‌డుల‌ కోసం కంపెనీలకు ఆహ్వానించాల‌ని సూచించారు.

Read more : KTR: నా వెంట్రుకలు, రక్తం ఇస్తా.. రాహుల్ గాంధీ ఇస్తారా? కేటీఆర్ సవాల్!
దీంతో వ‌రంగ‌ల్ జిల్లాలో గ్లాస్ట‌ర్ లిమిటెడ్ అనే కంపెనీ, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో ఎంబీజీ క‌మాటెడిస్ అనే కంపెనీ, కామారెడ్డి జిల్లాలో కాళేశ్వ‌రం అగ్రో కంపెనీ జ‌న‌ప‌నార మిల్లుల‌ను ఏర్పాటు చేస్తున్నాయని..ఈ మూడు కంపెనీలు క‌లిపి రూ. 887 కోట్ల పెట్టుబ‌డులు పెడుతున్నాయి. 10,480 మందికి ప్ర‌త్య‌క్షంగా ఉపాధి అవ‌కాశాలు లభిస్తాయ‌ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు.