KTR-Revanth : రేవంత్‌పై కేటీఆర్ పరువు నష్టం దావా

డ్రగ్స్ విషయంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నవారిపై పరువునష్టం దావా వేశానని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

KTR-Revanth : రేవంత్‌పై కేటీఆర్ పరువు నష్టం దావా

Ktr Revanth2

KTR – Revanth Reddy : డ్రగ్స్ ఆరోపణలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, Tపీసీసీ చీఫ్-మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య ట్వీట్ వార్, డ్రగ్స్ డైలాగ్ వార్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి చేస్తున్న సవాళ్లకు… కేటీఆర్ ప్రతి సవాళ్లు విసురుతున్నారు. రాహుల్ గాంధీ శాంపిల్స్ ఇచ్చేందుకు ముందుకొస్తే.. తాను శాంపిల్స్ ఇవ్వడానికి రెడీ అని తాజాగా మరోసారి రేవంత్ కు కేటీఆర్ ట్విట్టర్ లో సవాల్ విసిరారు. ఐతే… తాజాగా… రేవంత్ పై న్యాయపోరాటానికి కేటీఆర్ రెడీ కావడం మరింత సంచలనంగా మారింది.

KTR: నా వెంట్రుకలు, రక్తం ఇస్తా.. రాహుల్ గాంధీ ఇస్తారా? కేటీఆర్ సవాల్!

డ్రగ్స్ విషయంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నవారిపై పరువునష్టం దావా వేశానని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కోర్టులో లీగల్ ఫైట్ కు వెళ్తున్నానని.. పరువునష్టం దావా వేశానని చెప్పారు. తనను లక్ష్యంగా చేసుకుని అసత్య ఆరోపణలు చేస్తున్న వారిని కోర్టు శిక్షిస్తుందని నమ్ముతున్నట్టు తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని కోర్టులో తేలబోతోందని  కేటీఆర్ ట్వీట్ చేశారు.

KTR Challenges Revanth: రేవంత్‌కు మరో సవాల్ విసిరిన కేటీఆర్.. నువ్వు టెస్టుకు సిద్ధమేనా..  

డ్రగ్స్ విషయంలో… కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. డ్రగ్స్ టెస్ట్ కోసం శాంపిల్స్ ఇవ్వడానికి తాను రెడీ అంటూ… మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి వైట్ ఛాలెంజ్ విసిరారు రేవంత్. అమరవీరుల స్థూపం దగ్గరకు రావాలని సవాల్ చేశారు. రేవంత్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి అమరవీరుల స్థూపం దగ్గర శాంపిల్స్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈ వివాదంపై తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కమ్ ఠాగూర్ కూడా స్పందించారు. ఇష్యూ నేషనల్ లెవెల్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

టెస్టుల్లో నాకు క్లీన్ చిట్ ఖాయం

మొదట ఇష్యూను రాజకీయ మాటల యుద్ధంగానే పరిగణించిన కేటీఆర్.. చర్లపల్లి జైలుకు వెళ్లివచ్చిన వారి మాటలకు బదులివ్వాల్సిన అవసరం లేదంటూ సవాళ్లతో ప్రతిస్పందించారు. రానురాను.. తనపై రేవంత్ వ్యక్తిగత ఆరోపణల దాడి పెంచుతుండటంతో… గట్టిగా బదులివ్వాలని డిసైడయ్యారు. లీగల్ ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నారు. డ్రగ్స్ కోణంలో వైద్య పరీక్షలు చేస్తే.. ఫలితాల్లో తనకు క్లీన్ చిట్ వస్తుందని… పరువు నష్టానికి కారణమైన వారికి కోర్టులో శిక్ష పడుతుందని ట్వీట్ చేశారు కేటీఆర్.

రాజద్రోహం కేసు పెడతాం

డ్రగ్స్ పరీక్షలకు తాను సిద్ధమని ఇప్పటికే చెప్పిన కేటీఆర్… అనవసరంగా దూషిస్తే రాజద్రోహం కేసు పెడతామని హెచ్చరించారు. ఈ విషయంలో తమకు మహారాష్ట్ర ప్రభుత్వమే స్ఫూర్తి అని ఇటీవల మీడియాతో చిట్ చాట్ లో చెప్పారు. జైలుకు వెళ్లి వచ్చిన రేవంత్ స్థాయి తనది కాదనీ.. కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ సిద్ధమా అని సవాల్ విసిరారు. రాహుల్ ఒప్పుకుంటే ఢిల్లీ ఎయిమ్స్ లో టెస్ట్ చేసుకోవడానికి రెడీ అన్నారు. తనకు క్లీన్ చిట్ వస్తే రేవంత్ సారీ చెప్పి పీసీసీ చీఫ్ పదవి వదులుకుంటారా అని ట్వీట్ చేశారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షలకు రెడీనా అని మరో సవాల్ చేశారు.