బాబోయ్ : ఎర్ర చీమలతో పచ్చడి చేసుకుని తింటున్నారు

చీమ.. కనిపిస్తే చాలు చంపేస్తారు కొందరు. కొందరికి వాంతి ఫీలింగ్ కలుగుతుంది. తినే సమయంలో చీమ కనిపించినా, ఆహారంలో వచ్చినా.. దాన్ని పక్కకి పెట్టేస్తారు కొందరు. మీ

  • Edited By: veegamteam , October 13, 2019 / 10:58 AM IST
బాబోయ్ : ఎర్ర చీమలతో పచ్చడి చేసుకుని తింటున్నారు

చీమ.. కనిపిస్తే చాలు చంపేస్తారు కొందరు. కొందరికి వాంతి ఫీలింగ్ కలుగుతుంది. తినే సమయంలో చీమ కనిపించినా, ఆహారంలో వచ్చినా.. దాన్ని పక్కకి పెట్టేస్తారు కొందరు. మీ

చీమ.. కనిపిస్తే చాలు చంపేస్తారు కొందరు. కొందరికి వాంతి ఫీలింగ్ కలుగుతుంది. తినే సమయంలో చీమ కనిపించినా, ఆహారంలో వచ్చినా.. దాన్ని పక్కకి పెట్టేస్తారు కొందరు. మీ సంగతి పక్కన పెడితే.. చీమలను పచ్చడిగా చేసుకుని తినే వాళ్లను చూశారా. కనీసం చీమలను పచ్చడిగా ఎంతో ఇష్టంగా తినేవారి గురించి విన్నారా. అవును.. వాళ్లకు ఎర్ర చీమలు అంటే చాలా ఇష్టం. అక్కడి వారు చీమలు కనిపిస్తే చాలు చటుక్కున మింగేస్తారు. వాటిని పట్టుకుని పచ్చడిగా చేసుకుని అన్నంలో కలుపుకుని తింటారు.

ఈ విచిత్రం ఎక్కడో వేరే దేశంలో కాదు. మన దేశంలోనే చోటు చేసుకుంది. జార్ఖండ్‌ రాష్ట్రంలో ఆది మానవుల తెగ కోడా జాతి వారు చీమలను తింటున్నారు. 6 తరాలుగా ఈ సంప్రదాయం పాటిస్తున్నారు. ఎర్ర చీమలు ఎక్కడ కనిపించినా వాటిని వదలకుండా తింటామని వారు చెబుతున్నారు. చీమల పుట్టల కోసం తాము వెదుకుతూ ఉంటామని చెబుతున్నారు. చీమలు చాలా రకాలు ఉంటాయి. అయితే వీరు తినేది మాత్రం పెద్ద ఎర్ర చీమలు. 

ప్రత్యేకంగా ఎర్ర చీమలనే తినడానికి కారణం లేకపోలేదు. వాటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి పోతాయని వారు చెబుతున్నారు. ఎర్ర చీమలను రెగ్యులర్‌గా తిన్న వారికి ఇప్పటి వరకు ఎలాంటి జబ్బులు కూడా రాలేదని అంటున్నారు. కంటి చూపు మెరుగ్గా ఉంటుందని వివరిస్తున్నారు. తమ పూర్వీకులు తమకు ఇచ్చిన ఆస్తిగా దీన్ని భావిస్తున్నాం అన్నారు. తమ పూర్వీకులు పాటించినట్లుగానే మేమూ పాటిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఎర్ర చీమలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పిల్లలకు కూడా చెబుతున్నారు.

దగ్గరలోని అడవుల్లోకి వెళ్లి మరీ ఎర్ర చీమల కోసం అన్వేషిస్తున్నారు. అక్కడ ఎర్ర చీమలను సేకరించి ఇంటికి తీసుకొస్తారు. బండపై వేసి రోలు కింద రుబ్బుతారు. ఆ తర్వాత పచ్చడి రూపంలో చేసుకుని తింటారు. ముందు చీమలను బాగా ఉడకబెడతామని చెప్పారు. ఇతర పదార్థాలతో కలిపి వండుతున్నారు. ఎర్ర చీమల కోసం స్థానికులు పెద్ద పెద్ద చెట్లు ఎక్కి మరీ వేటాడతారు.

ఎర్ర చీమలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు రావని స్థానికులు చెబుతున్నా.. వైద్య పరంగా ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. దీనిపై కొందరు డాక్టర్లు పరిశోధనలు జరుపుతున్నారు.