China Virgin Boy Egg : ‘మూత్రం’తో ఉడికించిన గుడ్లు..లొట్టలేసుకుంటు తినేస్తున్న చైనీయులు

మూత్రం’తో ఉడికించిన గుడ్లని చైనీయులు లొట్టలేసుకుంటు తినేస్తున్నారు. టాయిలెట్లలో ఏడు రోజులు గుడ్లను నానబెట్టి ఆతరువాత దాంట్లో ఉడకబెట్టి ఆ గుడ్లు తింటే ఎన్నో ఆరోగ్యాలని చెబుతున్నారు.

China Virgin Boy Egg : ‘మూత్రం’తో ఉడికించిన గుడ్లు..లొట్టలేసుకుంటు తినేస్తున్న చైనీయులు

China Virgin Boy Egg

China Virgin Boy Egg: ప్రపంచంలో ఎక్కడైనా సరే టాయిలెట్ అంటే మనిషి శరీరంలోని వ్యర్ధాలకు బయటకు పంపించే ప్రదేశం. అది బహిరంగ టాయిలెట్ అయినా..అటార్చెడ్ టాయిలెట్ అయినా సరే. కానీ అటువంటి టాయిలెట్ తో వంట చేస్తారట. మూత్రంతో గుడ్లు ఉడకబెట్టి వాటిని లొట్టలేసుకుంటు తినేస్తారట. ఇదేదో కథ కానేకాదు. డిస్కవరీ చానెల్ లో జరిగే సంఘటనలు అంతకంటే కాదు. మన పొరుగున ఉన్న డ్రాగన్ దేశంలో జరిగే తంతు ఇది.

,చైనాలో ఆహారం అలవాట్ల గురంచి మనకేంటీ ప్రపంచానికి తెలిసిందే. పాకేవి, దేకేవి,ఈదేవి, ఎగిరేవి, తేలేవి అది, ఇది అని తేడాలేకుండా అన్నింటికీ లాగించేస్తారు చైనీయులు. ఇన్ని రకాల నాన్ వెజ్ లు తినే చైనీయులు యాక్ అనింపించే వంటకాలను కూడా తినేస్తున్నారని తెలిస్తే ‘ఛీ యాక్’అంటాం. ఆ వింత వంటకం ఏంటంటే టాయిలెట్ తో ఉడకబెట్టిన గుడ్లు.. చైనాలోని జెజియాంగ్‌ ప్రాంతంలో మూత్రంతో ఉడకపెట్టిన గుడ్లు స్పెషల్ డిష్ అట.

Read more : కుక్క పిల్లలను వదలని చైనాలోని మాంసం వ్యాపారులు

బాత్రూమ్ పరిసరప్రాంతాల్లో కనీసం తినటానికే కాదు కనీసం కూర్చోవటానికి కూడా ఇష్టపడం.. కానీ చైనీయులే రూటే సెపరేటు. చైనాలోని జెజియాంగ్‌లో ఏకంగా టాయిలెట్ తోనే వంటను చేస్తారు. డాంగ్‌యాంగ్లో అనే ప్రాంతాల్లో మూత్రంలో ఉడకబెట్టిన గుడ్లను తింటారట. ఇలా గుడ్లను ఉండికించడానికి మూత్రం కూడా సేకరించడానికి ఒక ప్రాసెస్ కూడా ఉందట. 10 ఏళ్ల లోపు వయసున్న మగపిల్లల నుంచి మూత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సేకరించి ఆ మూత్రంలో గుడ్లు నానబెట్టి ఉడికించి ప్రత్యేక ఆహార పదార్ధాలను తయారు చేస్తారు.

వీటిని ‘Virgin boy egg’ డిష్ అనే పేరుతో లొట్టలేసుకుంటు తినేస్తారు. సంప్రదాయ వంటగా ఇది చాలా ఫేమస్ అట. ఇలా మూత్రం సేకరించడానికి ఫుడ్ స్టాల్స్ వారు స్కూల్స్ లో బకెట్లను పెడతారు. ఆ బకెట్లలో 10 లోపు వయసున్న మగపిల్లలు టాయిలెట్ పోస్తారు. అలా ఆ మూత్రంలో గుడ్లను 7గంటలు నానబెట్టి ఆ తరవాత వాటిని ఉడకబెట్టి.. పైన పెంకు వలిచి అప్పుడు గుడ్లతో రకరకాల ఆహారపదార్ధాలను తయారు చేస్తారు. ఈ ఫుడ్ ని తినడం అక్కడవారు సంస్కృతిలో భాగంగా మారిపోయింది.

Read more : China Real Estate Crisis : చైనా నుంచి ప్రపంచానికి పొంచి ఉన్న మరో ముప్పు

మూత్ర గుడ్లతో ఆరోగ్య ప్రయోజనాలు:
మూత్రంతో ఉడకబెట్టిన గుడ్లు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చైనీయుల నమ్ముతారు. మూత్రంలో నానబెట్టిన గుడ్లను తినటం వల్ల శరీరంలో వేడిని తగ్గించటంతో పాటు రక్తప్రసరణ సరిగా జరిగేలా చూస్తుందని చెబుతుంటారు వీళ్లు. ప్రాచీన కాలంలో గుడ్లు వారి సొంత మూత్రంలో ఏడు రోజులుపాటు ఉంచి..వాటిని మూడు నెలలపాటు తింటే ఆస్తమా హాంఫట్ అయిపోతుందని నమ్మేవారట.

Read more : ఈ దుకాణాలే మహమ్మారికి జన్మస్థానాలు. అయినా మారని చైనా…యదేచ్ఛగా కుక్క మాంసం విక్రయాలు

చిన్నపిల్లవాడి మూత్రం చాలా శక్తివంతమైనది చైనీయులు నమ్ముతారు. ఈ మూత్రాన్ని మూలికలతో కలపి టానిక్ కూడా తయారు చేస్తారట. పైగా యూరిన్ థెరపీ అనేది చైనీయులు సంప్రదాయం. పూర్వ కాలంలో మూత్రాన్ని మెడిసన్ గా వాడేవారట. మూత్రాన్ని వాపు, చర్మం, నోటి ఫంగల్ ఇన్ ఫెక్షన్ లు తగ్గడానికి కూడా ఉపయోగించేవారట. చైనా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ మూత్రం వైద్యాలు చేస్తుంటారు. దటీజ్ చైనా సంప్రదాయం అనే చెప్పాలి.