కుక్క పిల్లలను వదలని చైనాలోని మాంసం వ్యాపారులు

కుక్క పిల్లలను వదలని చైనాలోని మాంసం వ్యాపారులు

చైనాలో కుక్కలు వణికిపోతున్నాయంట. చిన్న కుక్క పిల్లలను సైతం అక్కడి వారు వదలడం లేదని, వాటిని చంపేసి..మాంసాన్ని మార్కెట్లో విక్రయించడానికే మొగ్గు చూపుతున్నారు. చైనా ప్రభుత్వం కుక్క మాంసం (Ban On Dog Meat) అమ్మకాలను బ్యాన్ చేసింది. కానీ కొంతమంది బేఖాతర్ చేస్తున్నారు. మాంసం మార్కెట్లకు కుక్కల సరఫరా కొనసాగుతూనే ఉంది. యులిన్ ఉత్సవాల సందర్భంగా కుక్కల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంటుందక్కడ.

china dog meet

కానీ యులిన్ ఉత్సవాల సందర్భంగా కొంతమంది తీసిన వీడియోలు గగురుపాటుకు గురి చేశాయి. కుక్కలను బోనులో బంధించడం, వాటి మాంసాన్ని వేలాడదీయడం, వాటి అవయవాలను వీధుల్లో పోయడం..భయానకంగా కనిపించాయి. ఈ విషయం యానిమల్ లవర్స్ కార్యకర్తలకు తెలిసింది. వెంటనే రంగంలోకి దిగారు.

chaina dog 2

మాంసం మార్కెట్ యజమానిపై వత్తిడి తెచ్చారు. పోలీసుల సహాయంతో బోనులో ఉన్న చిన్న చిన్న కుక్క పిల్లలను రక్షించారు. కుక్కలను విడిపించేందుకు జెన్నిఫర్ చెన్ అనే కార్యకర్త సహాయం చేశారు. వీటికి సంబంధించిన వీడియోలను తీసి…జంతు హక్కుల సంఘం హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ కు పంపాడు.

తాను మొదట కుక్క పిల్లలను బయటకు తీసే సమయంలో అవి వణికిపోతున్నాయని చెప్పుకొచ్చాడు.
మాంసం మార్కెట్ల నుంచి రక్షించి…ఆసక్తి కలిగిన వారికి దత్తత ఇచ్చేందుకు జంతు సంరక్షణ కార్యకర్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.

dog meat

మానవ ఆహారం యొక్క అధికార జాబితా నుంచి కుక్కలను తొలగిస్తూ…కుక్కల మాంసాన్ని నిషేధిస్తున్నట్లు గత నెలలో ప్రభుత్వం వెల్లడించింది. అయినా..కొంతమంది మారడం లేదని, మాంసం వ్యాపారులు ఇప్పటికి కుక్క మాంసం విక్రయిస్తున్నారని అంటున్నారు.

Read: ఫాదర్స్ డే-2020: గూగుల్ డూడుల్.. మీ నాన్నకు ఇలా గ్రీటింగ్ కార్డ్ పంపండి