Buchibabu Sana : డిప్యూటీ సీఎం ఇలాఖాలో.. ‘పెద్ది’ డైరెక్టర్ గృహప్రవేశం.. బుచ్చిబాబు సాన భార్యని చూశారా?

పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సాన కొత్తింట్లోకి గృహప్రవేశం చేసాడు. (Buchibabu Sana)

Buchibabu Sana : డిప్యూటీ సీఎం ఇలాఖాలో.. ‘పెద్ది’ డైరెక్టర్ గృహప్రవేశం.. బుచ్చిబాబు సాన భార్యని చూశారా?

Buchibabu Sana

Updated On : November 9, 2025 / 12:26 PM IST

Buchibabu Sana : ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే 100 కోట్ల హిట్ కొట్టాడు. ఇప్పుడు బుచ్చిబాబు సాన ఏకంగా రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.(Buchibabu Sana)

ఇప్పటివరకు పెద్ది నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ షూట్ కి కాస్త గ్యాప్ వచ్చింది.

Also Read : Jayakrishna Ghattamaneni : మహేష్ బాబు కొడుకు హీరోగా సినిమా అనౌన్స్.. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

ఈ గ్యాప్ లో పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సాన కొత్తింట్లోకి గృహప్రవేశం చేసాడు. బుచ్చిబాబు తన సొంతూరు పిఠాపురం అని గతంలో పలు వేదికలపై తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బుచ్చిబాబు ఇప్పుడు అదే పిఠాపురంలో తన సొంతింట్లోకి గృహప్రవేశం చేసారు.

బుచ్చిబాబు తన భార్యతో కలిసి సొంతింట్లోకి గృహప్రవేశం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు బుచ్చికి కంగ్రాట్స్ తెలుపుతున్నారు.

Also Read : Anupama Parameswaran : పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అనుపమ.. తీరా చూస్తే 20 ఏళ్ళ అమ్మాయి.. హీరోయిన్ పోస్ట్ వైరల్..