Xi Jinping third term as China's president
Xi Jinping : చైనా అధ్యక్షుడిగా 69 ఏళ్ల షీ జిన్‌పింగ్ (Xi Jinping) సరికొత్త చరిత్ర లిఖించారు. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నేతగా గుర్తంపు పొందిన జిన్ పింగ్ ముచ్చటగా మూడవసారి దేశాధ్యక్షుడిగా ఎన్నికై శుక్రవారం (మార్చి 10,2023) బాధ్యతలు చేపట్టారు. ముచ్చటగా మూడోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టిన నేతగా పేరొందారు. దీంతో జిన్ పింగ్ కు మరో ఐదు సంవత్సరాలపాటు అధ్యక్ష (President) బాధ్యతలు అప్పగిస్తూ చైనా పార్లమెంట్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. దీంతో చైనాకు జీవితకాల అధినాయకుడిగా ఉండేందుకు మార్గం సుగమమం అయ్యింది.
ఐదేళ్లకు ఒకసారి జరిగే..కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) కాంగ్రెస్ సమావేశాలు 2022 అక్టోబర్ లో జరిగాయి. ఈ సమావేశాల్లో 69 ఏళ్ల జిన్‌పింగ్‌ను మరోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. దీంతో సీపీసీ వ్యవస్థాపకుడు మావో తర్వాత మూడోసారి పార్టీ పగ్గాలు అందుకున్న తొలి నేతగా జిన్‌పింగ్ ఘనత సాధించారు. సీపీసీ (CPC)లో జిన్ పింగ్ కు పార్టీ బాధ్యతలు అప్పగించడంతో.. మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
సీపీసీ నిర్ణయాలనే యథాతథాగా అమలు చేస్తూ ‘రబ్బర్ స్టాంప్ పార్లమెంట్’గా పేరొందిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (Parliament of China).. జిన్‌పింగ్ (Xi Jinping)ను మూడవసారి అధ్యక్షుడిగా శుక్రవారం (మార్చి10,2023) ఎన్నుకుంది.2,952 మంది సభ్యులు ఆయనను ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక తర్వాత.. జిన్‌పింగ్ రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. అలా మూడవసారి అధ్యక్షుడిగా ఎన్నికై జిన్ పింగ్ చరిత్ర సృష్టించారు. ఉపాధ్యక్షుడిగా జిన్‌పింగ్ కు అత్యంత సన్నిహితుడు హన్ ఝెంగ్‌ను ఎన్నికయ్యారు.
Mao Zedong-Xi Jinping : మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తిమంతమైన నేతగా జిన్‌పింగ్..!!
చైనా అధ్యక్ష పదవీ విరమణ వయసు 68. రెండుసార్లు మాత్రమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలనే నిబంధన ఉంది కమ్యూనిస్టు పార్టీకి. కానీ జిన్ పింగ్ ఆ నియమానికి అతీతంగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీని కోసం 2018లో పార్టీ రాజ్యాంగాన్ని సవరించారు. దీంతో జిన్‌పింగ్ తన జీవిత కాలం అధ్యక్షుడిగా కొనసాగటానికి దారులు వేసుకున్నట్లుగా భావించవచ్చు.
కాగా..ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యంగా గుర్తింపు తెచ్చుకున్న చైనా సాయుధ దళాలకు (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA) అధిష్ఠానం కేంద్ర మిలిటరీ కమిషన్ ఛైర్మన్‌గానూ జిన్‌పింగ్‌నే ఎన్నుకుంటూ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ నేడు తీర్మానించింది. దీంతో అధికారాలన్నీ మళ్లీ జిన్‌పింగ్ చేతుల్లోకే వెళ్లాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా, మిలిటరీ కమిషన్ ఛైర్మన్‌గా చైనా (China)లోని మూడు అధికార కేంద్రాలకు ఆయన నాయకుడిగా కొనసాగనున్నారు. దీంతో ఇక జిన్‌పింగ్ జీవితకాలం అధికారంలో ఉండనున్నారని అనుకోవాల్సిందే. దీంతో చైనా అంటే జిన్ పింగ్..జిన్ పింగ్ అంటే చైనా అనేలా పేరొందారు.
Omicron Name : కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ పేరు వెనుక..చైనా అధ్యక్షుడు పేరులో ‘ Xi ’కథాకమామీషు..