Xi Jinping opens Chinese Communist party
Chinese President: చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ వరుసగా మూడోసారి అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై చరిత్ర సృష్టించడంతో ఆయనకు పలు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా చైనా మిత్ర దేశాలు పాకిస్థాన్, రష్యా, ఉత్తరకొరియా అధినేతలు షీ జిన్ పింగ్ ఎన్నికైన వెంటనే ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటనలు చేశారు.
‘‘వరుసగా మూడోసారి కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన జిన్ పింగ్ కు యావత్ పాకిస్థాన్ ప్రజల తరఫున జిన్ పింగ్ కు శుభాకాంక్షలు. చైనా ప్రజలకు సేవ చేయడంలో ఆయనకు ఉన్న నిబద్ధత చాలా గొప్పది’’ అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ‘‘షీ జిన్ పింగ్ కు శుభాకాంక్షలు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నాను’’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
‘‘మంచి వార్త అందింది.. జిన్ పింగ్ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు’’ అని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పారు. ఉత్తరకొరియా-చైనా మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృష్టి చేద్దామని పిలుపునిచ్చారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..