Zelensky : జెలెన్స్కీ సంచలన నిర్ణయం…యుక్రెయిన్ కొత్త రక్షణ మంత్రి నియామకం

యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ ఒడెసా ప్రాంతంలో రష్యా డ్రోన్ల దాడి జరిగిన కొన్ని గంటలకే జెలెన్స్కీ యుక్రెయిన్ రక్షణ మంత్రిగా పనిచేస్తున్న ఒలెక్సీ రెజ్నికోవ్ ను తొలగించారు....

Zelensky

Zelensky : యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ ఒడెసా ప్రాంతంలో రష్యా డ్రోన్ల దాడి జరిగిన కొన్ని గంటలకే జెలెన్స్కీ యుక్రెయిన్ రక్షణ మంత్రిగా పనిచేస్తున్న ఒలెక్సీ రెజ్నికోవ్ ను తొలగించారు. ఒలెక్సీ రెజ్నికోవ్ 550 రోజులుగా రష్యాతో జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడని జెలెన్స్కీ చెప్పారు. జెలెన్స్కీ క్రిమియన్ టాటర్‌కు చెందిన రుస్టెమ్ ఉమెరోవ్‌ను కొత్త రక్షణ మంత్రిగా నియమించారు. (Zelensky Replaces Ukraines Defence Minister)

Delhi G20 Summit : ఢిల్లీలో జి 20 సదస్సును అడ్డుకోండి…ఖలిస్థానీ వేర్పాటువాది సంచలన ఆడియో సందేశం

యుద్ధంలో యుక్రెయిన్ సైన్యానికి కొత్త విధానాలు అవసరమని జెలెన్స్కీ చెప్పారు. యుక్రెయిన్ పార్లమెంటు ఆమోదంతో రెజ్నికోవ్ స్థానంలో గత సంవత్సరం నుంచి స్టేట్ ప్రాపర్టీ ఫండ్‌కు అధిపతిగా ఉన్న క్రిమియన్ టాటర్‌కు చెందిన రుస్టెమ్ ఉమెరోవ్‌ను నామినేట్ చేశారు. ఇరాన్ తయారు చేసిన షాహెద్ డ్రోన్‌లతో రష్యా ఒడెసా ప్రాంతంపై దాడి చేసినట్లు యుక్రెయిన్ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు