Zelensky Vs Putin : బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ ఏ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలం ఉంది. ఆ బలమే జెలెన్ స్కీ. ఇన్నాళ్లు యుక్రెయిన్ ను భయపడుతూ దండయాత్ర చేస్తూ వచ్చింది రష్యా. రూమ్ లో వేసి కొడితే పిల్లి కూడా తిరగబడినట్లు.. ఇప్పుడు యుక్రెయిన్ సింహ గర్జనతో మాస్కో వణికిపోతోంది. దండయాత్రను యుద్ధంగా మార్చి ఉగ్రరూపంలో చూపిస్తోంది యుక్రెయిన్. రష్యా గడ్డపై బీభత్సం సృష్టిస్తోంది. జెలెన్ స్కీ దెబ్బ.. పుతిన్ అబ్బా.. అన్నట్లుగా మారింది సిట్యుయేషన్. ఇన్నాళ్లు దాడులను తట్టుకునేందుకు ఇబ్బంది పడిన యుక్రెయిన్.. ఇప్పుడు ఏకంగా రష్యాలోకి చొచ్చుకు వెళ్తోంది. అసలు యుక్రెయిన్ రివర్స్ ఎటాక్ వెనుక ప్లాన్ ఏంటి? యుద్ధ భూమిలో ఎవరిది పైచేయి కాబోతోంది.
యుక్రెయిన్ సింహగర్జనలో జెలెన్ స్కీ వ్యూహం ఏంటి?
ఒంటరి పోరు చేసింది. సింగిల్ గా నిలబడింది. ఇప్పుడు రివర్స్ అటాక్ చేస్తోంది యుక్రెయిన్. ఇన్నాళ్లు తగ్గింది నెగ్గడం కోసమేనని ప్రూవ్ చేస్తోంది. సర్వం కోల్పోయిన తగ్గలేదు జెలెన్ స్కీ. ఎవరూ కలిసి రాకున్నా ఒక్కడై పోరాడారు. ఇప్పుడు రష్యాను భయపెడుతున్నారు. అందరి అంచనాలను మించి భీకర దాడులు చేస్తోంది యుక్రెయిన్. ఇంతకీ ఈ దాడుల వెనుక జరుగుతున్నదేంటి? యుక్రెయిన్ సింహగర్జనలో జెలెన్ స్కీ వ్యూహం ఏంటి? శత్రు దేశం అంతగా చొచ్చుకొస్తున్నా ఎందుకు రష్యా భరిస్తూ వస్తోంది. చేతగాక భూభాగం ఆక్రమణను ఒప్పుకుంటన్నారా?ముందుగా ఏదైనా మాస్టర్ స్కెచ్ వేశారా?
Also Read : మహిళలను దేవతగా కొలిచే దేశంలో ఎందుకీ కీచక పర్వం? స్త్రీ మూర్తులకు రక్షణ ఏది?