మహిళలను దేవతగా కొలిచే దేశంలో ఎందుకీ కీచక పర్వం? స్త్రీ మూర్తులకు రక్షణ ఏది?
రక్షాభందన్ పేరుకేనా? నేను మీకు రక్ష, నువ్వు నాకు రక్ష.. అనేది ట్యాగ్ లైన్ గానే మిగిలిపోతోందా? రాఖీ కట్టే చేతులకు రక్షణ ఏది?

Women Safety : మహిళలు దేవతగా కొలిచే దేవభూమి. సృష్టికి మూలం స్త్రీ మూర్తి. అనురాగం, ఆప్యాయతలు పంచే ప్రేమమయి ఆమె. ఇవన్నీ మాటలకే సరిపోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి నుంచి అంతరిక్ష యాత్ర చేసే వరకు మహిళలు ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఏదో ఒక చోట కామాంధుల కీచక పర్వానికి బలైపోతున్నారు. మరిచిపోలేని గాధలు మహిళలను వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్నటికీ తీరని ఆత్మఘోషలు తల్లిదండ్రులకు కడుపు కోతలు, కన్నీళ్లను మిగులుస్తున్నాయి. కనికరమే లేకుండా మానవత్వం కనుమరుగై అరాచకానికి గురవుతున్నారు మహిళలు. రక్షాభందన్ పేరుకేనా? నేను మీకు రక్ష, నువ్వు నాకు రక్ష.. అనేది ట్యాగ్ లైన్ గానే మిగిలిపోతోందా? రాఖీ కట్టే చేతులకు రక్షణ ఏది? మహిళలను దేవతగా కొలిచే దేశంలో ఎందుకీ కీచక పర్వం?
మహిళలతో బిహేవ్ చేసే తీరులో మార్పు వచ్చేదెప్పుడు?
నిర్భయ చట్టం అభయం ఇవ్వడం లేదు. దిశ ఘటన తర్వాత కూడా మహిళలపై దాడులు ఆగడం లేదు. మగాడి తీరులో మార్పు రాకపోవడంతో దేశంలో ఏదో ఒక చోట ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. స్త్రీలపై అఘాయిత్యాలు జరిగితే ప్రభుత్వాలు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాయి. అయినా మృగాడిగా మారుతున్న మగాడు రాక్షసుడి రూపంలో దాడులు చేస్తూనే ఉన్నారు. రేప్, మర్డర్ కేసులు ప్రభుత్వాలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. స్త్రీ భద్రత సమాజ బాధ్యత కాదా? మహిళలను కాడాల్సింది ప్రభుత్వాలేనా? ఈ ఘటనలకు కారణలు ఏంటి? స్త్రీ రక్షణ చట్టాలపై అవగాహన ఎందుకు ఉండటం లేదు? మహిళలతో బిహేవ్ చేసే తీరులో మార్పు వచ్చేదెప్పుడు?
Also Read : కోల్‌కతా డాక్టర్ కేసులో అసలేం జరిగింది? కనిపించే దేవుళ్లకు భద్రత ఏది?