Zero Daily Covid Deaths: లాక్‌డౌన్లు, టీకాల ఎఫెక్ట్.. జూలై నుంచి యూకేలో తొలిసారి జీరో మరణాలు

యూకేలో లాక్ డౌన్లు, కొవిడ్ వ్యాక్సినేషన్ సక్సెస్ అయింది.. ఫలితంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. ఇంగ్లండ్‌లో రోజువారీ కరోనా మరణాలు కూడా నమోదు కాలేదు.

Zero daily Covid deaths : యూకేలో లాక్ డౌన్లు, కొవిడ్ వ్యాక్సినేషన్ సక్సెస్ అయింది.. ఫలితంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మరణాలు కూడా
భారీగా తగ్గిపోయాయి. ఇంగ్లండ్‌లో రోజువారీ కరోనా మరణాలు కూడా నమోదు కాలేదు. గత ఏడాది జూలై తర్వాత నుంచి యూకేలో మొదటిసారిగా జీరో కరోనా మరణాలు
నమోదయ్యాయి. 2020 ఏడాది జూలై 30 తర్వాత ఇంగ్లాండ్‌లో పాజిటివ్ కోవిడ్ టెస్టులు జరిగిన 28 రోజులలోపు ఎలాంటి మరణాలు నమోదుకాలేదని గుర్తించారు. ఇక
స్కాట్లాండ్ లేదా ఉత్తర ఐర్లాండ్‌లో సోమవారం ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు.

కొవిడ్‌కు సంబంధించిన నాలుగు మరణాలు వేల్స్‌లో మాత్రమే నమోదయ్యాయి. ఈ గణాంకాలు కోవిడ్-సంబంధిత మరణాల్లో ఒక భాగం మాత్రమేనని నిపుణులు అంటున్నారు. కరోనా మరణాల రిపోర్టు ఆలస్యం వల్ల ఇలా జరుగుతుంటుందని పేర్కొన్నారు. ఏదిఏమైనా తగ్గుతున్న మరణాల సంఖ్య ఆశాజనకంగా ఉందని చెబుతున్నారు. కరోనా టీకాలు ప్రభావంతంగా పనిచేయడం వల్లే కరోనా మరణాలు తగ్గిపోతున్నాయని భావిస్తున్నారు. వారంలో రెండవభాగంలో మరణాల రికార్డు భారీగా ఉండేది… కానీ, ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య యువకుల్లో ఎక్కువగా ఉంటోంది.

యువకుల్లో కరోనా కేసులు నమోదు కావడంతో మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ -19 మరణాల రోజువారీ సంఖ్య మూడు నెలల క్రితం కంటే చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు. జనవరి చివరిలో, యుకెలో ప్రతిరోజూ 1,000 మందికి పైగా కొత్తగా కరోనా మరణాలు నమోదయ్యాయి. యూకేలో పరిస్థితి ప్రస్తుతం సానుకూలంగా ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి విజృంభిస్తోంది.

యూకేలో టీకాలు పనిచేస్తుండటంతో మెల్లగా ఆంక్షలను తొలగిస్తున్నారు. త్వరలోనే కుటుంబాలు, స్నేహితులతో ఇంట్లో గడిపే రోజులు రానున్నాయి. పబ్‌, సినిమా హాళ్లలో, రెస్టారెంట్లలో కలిసేందుకు అనుమతులు రానున్నాయి. ఆరుగురు వ్యక్తులు, రెండు కుటుంబాలు కలుసుకొనేందుకు మే 17 నుంచి అనుమతించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు