RR vs SRH : ఐపీఎల్ 2020లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్లుగా రాబిన్ ఊతప్ప, బెన్ స్టోక్స్ ఇన్నింగ్స్ ఆరంభించారు.
అయితే ఆదిలోనే ఊతప్ప(19) రనౌట్ అయ్యాడు. బెన్ స్టోక్స్ (30) పరుగులతో రాణించాడు. ఊతప్ప స్థానంలో వచ్చిన శాంసన్ జోడీగా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
వీరిద్దరూ 56 పరుగుల భాగస్వామాన్ని నెలకొల్పారు. హోల్డర్ బౌలింగ్‌లో శాంసన్(36) ఔటయ్యాడు.
హోల్డర్ వేసిన 12 ఓవర్‌లో నాల్గో బంతికి శాంసన్ పెవిలియన్ చేరాడు. బెన్ స్టోక్స్ కూడా (30) పెవిలియన్ చేరాడు. రషీద్ ఖాన్ వేసిన 13 ఓవర్ తొలి బంతికి స్టోక్స్ ఔట్ అయ్యాడు.
జోస్ బట్లర్(9), స్టీవ్ స్మిత్(19)లు పేలవ ప్రదర్శనతో స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు.
హోల్డర్ వేసిన 19 ఓవర్ తొలి బంతికి భారీ షాట్ కొట్టబోయి స్మిత్ ఔట్ కాగా.. రెండో బంతికి రియాన్ పరాగ్(20) వార్నర్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. చివర్లో జోఫ్రా ఆర్చర్(16 నాటౌట్), తేవాతియా (2, నాటౌట్)గా నిలిచారు. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
దీంతో హైదరాబాద్ జట్టుకు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సన్ రైజర్స్ బౌలర్లలో హోల్డర్ 3 వికెట్లతో మెరిపించాడు. విజయ్ శంకర్, రషీద్ ఖాన్‌లు తలో వికెట్ తీసుకున్నారు.