IPL 2021, RCB Vs KKR : బెంగళూరు 204 రన్స్, డివిలియర్స్ విశ్వరూపం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్ మెన్ డివిలియర్స్ విశ్వరూపం చూపెట్టాడు. కేవలం 34 బంతుల్లో 76 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

Bangalore Set 205 Run Target For Kolkata : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్ మెన్ డివిలియర్స్ విశ్వరూపం చూపెట్టాడు. కేవలం 34 బంతుల్లో 76 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 9 ఫోర్లు, 3 సిక్స్ లున్నాయి. అంతకముందు మాక్స్ వెల్ కూడా తన ప్రతాపాన్ని చూపెట్టాడు. 49 బంతుల్లో 78 రన్లు చేసి అవుట్ అయ్యాడు. మొత్తంగా బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. తొలుత టాస్ నెగ్గిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కోహ్లీ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. పాటిదార్ (1) వెనుదిరిగాడు.

పడిక్కల్, మాక్స్ వెల్ లో కోల్ కతా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించారు. ప్రధానంగా మాక్స్ వెల్ తన బ్యాట్ కు పని చెప్పాడు. ఇతడిని అవుట్ చేయడానికి కోల్ కతా బౌలర్లు శ్రమించారు. మాక్స్ వెల్ కు చక్కటి సహకారం అందిస్తున్న పడిక్కల్ (25) ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న మాక్స్ వెల్ (78) ను కమిన్స్ అవుట్ చేశాడు. వచ్చిరాగానే..డివిలియర్స్ తన ప్రతాపం చూపెట్టాడు. 34 బంతుల్లో 76 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. జేమిసన్ 11 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. మొత్తానికి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన బెంగళూరు జట్టు 204 పరుగులు చేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో వరుణ్ చక్రర్తి 2 వికెట్లు, కమిన్స్, ప్రసిద్ధ్ చెరో ఒక వికెట్ తీశారు.

Read More : IPL 2021 : మాక్స్ వెల్ సెంచరీ మిస్..డివిలియర్స్ దూకుడు

ట్రెండింగ్ వార్తలు