BioBubble IPL : బయోబబుల్‌.. ఐపీఎల్‌ అవసరమా..? లీగ్ రద్దు చేయాల్సిందే..!

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో... ఇప్పుడు ఐపీఎల్‌ టోర్నీ అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది. బయోబబుల్‌ వాతావరణంలో ఐపీఎల్‌ను నిర్వహిస్తున్నా కూడా... కరోనా కేసులు రావడంతో ఇక లీగ్‌ను రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ వినిపిస్తోంది.

BioBubble IPL Tournamnet : దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో… ఇప్పుడు ఐపీఎల్‌ టోర్నీ అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది. బయోబబుల్‌ వాతావరణంలో ఐపీఎల్‌ను నిర్వహిస్తున్నా కూడా… కరోనా కేసులు రావడంతో ఇక లీగ్‌ను రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ వినిపిస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ క్యాంప్‌లో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఆర్సీబీతో జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు.

ఈ నేపథ్యంలో మిగతా మ్యాచ్‌లు ఎంతవరకూ జరుగుతాయనే అనుమానం అందరిలో మొదలైంది. మరోవైపు మాజీ క్రికెటర్లు కూడా ఐపీఎల్‌ను ఆపితేనే మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లు, మాజీలు కూడా ఐపీఎల్‌ టోర్నీని తక్షణమే రద్దు చేయాలని బీసీసీఐకు సూచిస్తున్నారు.

ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యాసాధ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌ ఘాటుగా స్పందించారు. బయోబబుల్‌లో ఐపీఎల్‌ జరుపుతున్నారు కాబట్టి కరోనా ఎఫెక్ట్‌ ఉండదని అనుకున్నామన్నారు. బయోబబుల్‌లో క్రికెటర్లంతా సేఫ్‌గానే ఉంటారని భావించారు.

కానీ దురదృష్టవశాత్తూ ఐపీఎల్‌ టోర్నీలో పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడుతున్నారన్నారు. అంటే.. బయోబబుల్‌లో కూడా రక్షణ లేదనేది స్పష్టమైందన్నారు. రాబోవు కాలంలో పరిస్థితులు కఠినంగా ఉండవచ్చన్న కీర్తి ఆజాద్‌.. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్‌ అవసరమా.. అని ప్రశ్నించారు. ఐపీఎల్‌ను ఆపివేయాలని డిమాండ్‌ చేశారు కీర్తి ఆజాద్‌.

ట్రెండింగ్ వార్తలు