IPL 2021-CSK vs KKR: చెన్నై చితక్కొట్టుడు.. దుమ్మురేపిన డుప్లెసిస్.. రెచ్చిపోయిన రుత్‌రాజ్

ఐపీఎల్ లీగ్ ‌2021లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టు చెన్నైని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. చెన్నై ఓపెర్లుగా బరిలోకి దిగిన డుప్లెసిస్, రుత్ రాజ్ గైక్వాడ్ చితక్కొట్టారు.

Csk Sets Target To Kkr For 221 Runs In Ipl 2021 (1)

IPL 2021-CSK vs KKR : ఐపీఎల్ లీగ్ ‌2021లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టు చెన్నైని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. చెన్నై ఓపెర్లుగా బరిలోకి దిగిన డుప్లెసిస్, రుత్ రాజ్ గైక్వాడ్ చితక్కొట్టారు. కోల్ కతా బౌలర్ల బంతులను బౌండరీలు దాటిస్తూ పరుగుల సునామీ సృష్టించారు. డుప్లెసిస్ 60 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులతో విరుచుకుపడి 95 పరుగులతో సెంచరీ చేరువలో నాటౌట్ గా నిలిచాడు.

మరో ఓపెనర్ గైక్వాడ్ కూడా 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 64 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరి భాగస్వామ్యంలో చెన్నై భారీ స్కోరు సాధించింది. మిగిలిన ఆటగాళ్లలో మొయిన్ అలీ (25), కెప్టెన్ ఎంఎస్ ధోనీ (17), రవీంద్ర జడేజా (6 నాటౌట్)తో నిలిచారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి చెన్నై 220 పరుగులు సాధించింది. ప్రత్యర్థి జట్టు కోల్ కతాకు 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.


చెన్నై స్కోరు 115 పరుగుల వద్ద వరుణ్‌ చక్రవర్తి వేసిన 13వ ఓవర్‌లో రుతురాజ్‌.. కమిన్స్‌ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మొయిన్‌ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి నరైన్‌ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి జతగా డుప్లెసిస్‌ ధాటిగా ఆడటంతో చెన్నై భారీ స్కోరు సాధించింది. 18.6 ఓవర్ల వద్ద ధోనీ ఔట్ కావడంతో చెన్నై 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునిల్ నరేన్, ఆండ్రూ రసెల్ తలో వికెట్ తీసుకున్నారు.