IPL 2021 : RCB vs RR : రాణించిన దూబె, తెవాతియా.. బెంగళూరు లక్ష్యం 178

Ipl 2021 Rcb Vs Rr

IPL 2021 : RCB vs RR : ఐపీఎల్ లీగ్ 2021లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు బెంగళూరుకు 178 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచిన బెంగళూరు రాజస్థాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రాజస్థాన్ ఆటగాళ్లు జోస్ బట్లర్ (8), మనన్ వోహ్రా (7) పేలవ ప్రదర్శనతో ఆదిలోనే చేతులేత్తేశారు.

ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ (21) పరుగులతో పర్వాలేదనిపించాడు. సుందర్ బౌలింగ్ లో మ్యాక్స్ వెల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. డేవిడ్ మిల్లర్ ఖాతానే తెరవలేదు. ఆపై క్రీజులోకి వచ్చిన శివమ్ దుబె చెలరేగి ఆడాడు. నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో విరుచుకుపడి 46 పరుగులతో హాఫ్ సెంచరీలో ఔటయ్యాడు. రిచర్డసన్ బౌలింగ్ లో మ్యాక్స్ వెల్ కు క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు.


అనంతరం రియాన్ పరాగ్ (25) పరుగులు చేశాడు. రాహుల్ తెవాతియా, దుబెలు రెచ్చిపోయారు. తెవాతియా 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో మెరవడంతో 40 పరుగులు చేశాడు. ఒక దశలో సిరాజ్‌ బౌలింగ్‌లో తెవాటియా అహ్మద్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రిస్ మోరిస్ (10), శ్రేయాస్ గోపాల్ (7 నాటౌట్) నిలిచాడు.

బెంగళూరు బౌలర్లలో సిరాజ్, హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీసుకోగా.. కైల్, రిచర్డసన్, సుందర్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ అన్నింటిలోనూ విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడి ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది.