IPL 2021: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు.. ఆడేది నేడే!

Ipl 2021

Rajasthan vs PBKS, 4th Match – ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేయనున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. క్రిస్ మోరీస్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.16.25 కోట్లకు సొంతం చేసుకోగా.. ఐపీఎల్ చరిత్రలో ఒక ఆటగాడు ఈ స్థాయిలో ధర పలకడం తొలిసారి.

క్రిస్ మోరిస్ ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్ తరపున పంజాబ్ కింగ్స్‌తో ఆడబోతున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సోమవారం సాయంత్రం 7.30 గంటలకు రెండు బలమైన జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఒక వైపు, కొత్త కెప్టెన్‌ సంజు శాంసన్‌తో రాజస్థాన్ రాయల్స్ జట్టు దిగజారింది, మరోవైపు కెఎల్ రాహుల్ నేతృత్వంలో జట్టు ఉంటుంది. ఇరు జట్లు తమ టోర్నమెంట్‌ను విజయంతో ప్రారంభించాలని భావిస్తున్నాయి.

రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మరియు లోయర్ ఆర్డర్ హిట్టర్ అయిన క్రిస్ మోరిస్ ఇప్పటివరకు 70 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. 157.87 స్ట్రైక్ రేట్ తో 551 పరుగులు చేశాడు. 80 వికెట్లను పడగొట్టాడు. గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన క్రిస్, ఇప్పుడు రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్నారు. మరోవైపు, పంజాబ్ జట్టు 14 కోట్లతో ఆస్ట్రేలియాకు చెందిన రిచర్డ్​సన్‌ను తీసుకోగా.. రిచర్డ్ కూడా ఈరోజు మ్యాచ్ ఆడబోతున్నాడు.

Rajasthan Royals(Probable XI): Jos Buttler (wk), Ben Stokes, Sanju Samson (c), Riyan Parag, Shivam Dube, Rahul Tewatia, Chris Morris, Liam Livingstone, Shreyas Gopal, Jaydev Unadkat, Kartik Tyagi

Punjab Kings(Probable XI): KL Rahul (c, wk), Mayank Agarwal, Chris Gayle, Nicholas Pooran, Deepak Hooda, Shahrukh Khan, Moises Henriques, Murugan Ashwin, Mohammed Shami, Riley Meredith, Ravi Bishnoi