Punjab Kings Beat Rajasthan Royals
RR Vs PBKS IPL 2021 Punjab Beat Rajasthan : ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు పోరాడి ఓడింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ 4 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. రాజస్తాన్ రాయల్స్ జట్టు 20ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు మాత్రమే చేసింది. రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుతంగా ఆడాడు. సెంచరీతో అదరగొట్టాడు. జట్టుని విజయతీరాల వరకు తీసుకెళ్లాడు. కానీ, ఆఖరి బంతికి 5 పరుగులు చేయాల్సి ఉండగా.. ఔటయ్యాడు. మ్యాచ్ లో చివరి బంతికి సంజూ వెనుదిరిగాడు. అతడి ఇన్నింగ్స్ లో 7 సిక్సులు, 12ఫోర్లు ఉన్నాయి. రాజస్తాన్ ఓడినా.. సంజూ తన బ్యాటింగ్ బీభత్సం సృష్టించాడు. ఒకానొక సమయంలో రాజస్తాన్ గెలుపు ఖాయం అని అంతా అనుకున్నాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు పరుగుల వరద పారించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భారీ స్కోర్ చేసింది. 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 రన్స్ చేసింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
స్కోర్లు
పంజాబ్-221/6
రాజస్తాన్ 217/7
సంజూ శాంసన్-63 బంతుల్లో 119 పరుగులు(7సిక్సులు, 12 ఫోర్లు)
కేఎల్ రాహుల్-50 బంతుల్లో 91 పరుగులు(5 సిక్సులు, 7ఫోర్లు)