Ravichandran Ashwin : ఐపీఎల్‌కు విరామం ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్

Ravichandran Ashwin : ఐపీఎల్ 2021 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ఇండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (34) ఐపీఎల్ కు విరామం ప్రకటించాడు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తన కుటుంబంలో వైరస్ వ్యాప్తితో తాను ఐపీఎల్ నుంచి కొద్దిరోజులు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. తన కుటుంబాన్ని చూసుకోవడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకున్నాడు.



కీలక ఆటగాడు అశ్విన్ టీ20 ఫ్రాంచైజ్ టోర్నమెంట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆడటానికి కొంత విరామం తీసుకుంటానని చెప్పాడు. ‘కరోన మహమ్మారి సమయంలో నా కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయం. ఈ కఠినమైన సమయాల్లో నేను వారికి తోడుగా ఉండాలనుకుంటున్నాను’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు. ఒకవేళ పరిస్థితులు అనుకూలిస్తే త్వరలో ఆటకు తిరిగి రావాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశాడు. అశ్విన్ తీసుకున్న నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నట్లు ఢిల్లీ పేర్కొంది.

ఈ క్లిష్ట సమయాల్లో మీకు మీ కుటుంబ సభ్యులకు మద్దతు తెలుపుతున్నామని, మీ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం’ అని ఢిల్లీ జట్టు పేర్కొంది. అశ్విన్ పదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 77 టెస్టులతో పాటు 111 వన్డేలు, 46 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. 409 టెస్ట్ వికెట్లు తీశాడు. తన హిస్టరీలో కేవలం 16 బౌలర్లలో 400 మార్కులను అధిగమించాడు. అశ్విన్ ట్విట్టర్ అకౌంట్లో 10 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తన ప్రొఫైల్ పేజీలో ‘ఇంటి వద్ద అందరూ సురక్షితంగా ఉండండి.. టీకా తీసుకోవాలి’ ఇలా కొటేషన్ పెట్టాడు.


ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ మధ్య ఆదివారం జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మిడిల్-ఆర్డర్ షో విఫలమైంది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ ద్వారా ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ అనంతరం అశ్విన్‌ విరామం నిర్ణయం ప్రకటించాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆడిన 5 ఆటలలో 8 పాయింట్లతో ఢిల్లీ రెండవ స్థానంలో ఉండగా, ఒక విజయంతో SRH ఏడో స్థానంలో ఉంది.


ట్రెండింగ్ వార్తలు