IPL 2021: మ‌ళ్లీ ఓడిన నైట్‌రైడ‌ర్స్‌.. షారుక్ ఏమ‌న్నాడో తెలుసా?

ఐపీఎల్ లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ టీమ్ వరుస పరాజేయాలతో నిరుత్సాహ పరుస్తుంది. గెలిచే మ్యాచ్ లను కూడా చేచేజాతుల జారవిడుస్తుంది. జట్టు ప్రదర్శనపై ఓనర్ షారుక్ ఖాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ మధ్య జరిగిన మ్యాచ్ లో గెలుపు అంచులవరకు వచ్చి ఓటమి చవిచూడటంతో షారుక్ ఖాన్ అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు.

Sharukh Khan

IPL 2021: ఐపీఎల్ లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ టీమ్ వరుస పరాజేయాలతో నిరుత్సాహ పరుస్తుంది. గెలిచే మ్యాచ్ లను కూడా చేచేజాతుల జారవిడుస్తుంది. జట్టు ప్రదర్శనపై ఓనర్ షారుక్ ఖాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ మధ్య జరిగిన మ్యాచ్ లో గెలుపు అంచులవరకు వచ్చి ఓటమి చవిచూడటంతో షారుక్ ఖాన్ అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు. ఆ తర్వాత జరిగిన మ్యాచ్ లో కూడా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ప్రదర్శనలో పెద్ద మార్పేమీ కనిపించలేదు.

బుధవారం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో టాపార్డర్ పేలవ ప్రదర్శన కనబరిచారు. 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలోనే రసెల్‌, కార్తీక్‌, క‌మిన్స్ లు అద్భుతమైన ఆటతీరును కనబరిచారు. ఒకానొకదశలో కోల్‌క‌తా గెలుస్తుందని అందరు అనుకున్నారు. కానీ 5 బంతులు మిగిలి ఉండగానే కోల్‌క‌తా ఆల్ అవుట్ అయింది.

ఇక రసెల్‌, కార్తీక్‌, క‌మిన్స్ ఆటతీరుపై జట్టు ఓనర్ షారుక్ ఖాన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. వుడా.. షుడా అంటూ గెలిచి ఉంటే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. అయినా మ్యాచ్‌లో అసాధార‌ణ పోరాటం చేసిన‌ ఈ ముగ్గురిపై ప్ర‌శంస‌లు కురిపించాడు. నైట్‌రైడ‌ర్స్ ర‌సెల్‌, క‌మిన్స్‌, కార్తీక్ అద్భుతంగా ఆడారు. దీన్నే అల‌వాటుగా మార్చుకోండి అని షారుక్ ట్వీట్ చేశాడు.