AP High Court Recruitment 2026 : నిరుద్యోగులకు శుభవార్త.. పది పాసైతే చాలు కోర్టులో జాబ్.. కొన్ని గంటలే ఉంది.. త్వరగా అప్లై చేయండి
AP High Court Recruitment 2026 : నిరుద్యోగులకు అలర్ట్.. కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.
- Dharani Pilli
- Updated on- April 18, 2026 / 06:11 PM IST
Andhra pradesh high court APHC Recruitment 2026 Apply For 300 Jobs Before April 19 2026
AP High Court Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ హైకోర్టు 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ aphc.gov.in సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఆసక్తి ఉన్న వారు త్వరగా దరఖాస్తు చేసుకోండి.
వివిధ విభాగాల్లో ఉన్న పలు ఖాళీల్లో నేరుగా అభ్యర్థులను నియమించేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌లోని ముఖ్య విశేషం ఏమిటంటే.. పోస్టులను బట్టి విద్యార్హతలు 10వ తరగతి ఉత్తీర్ణత నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు, అలాగే టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించారు. మొత్తం 13 రకాల పోస్టులు ఈ రిక్రూట్‌మెంట్ పరిధిలోకి వస్తాయి.
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించబడుతుంది. అభ్యర్థులు 2026 మార్చి 30 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 19, 2026 రాత్రి 11:59 గంటల వరకు ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవు. కాబట్టి అభ్యర్థులు నిర్ణీత సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి. కేవలం అధికారిక వెబ్‌సైట్ aphc.gov.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించడమైనది.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 13 విభిన్న విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి:
- అసిస్టెంట్ – 78,
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 50,
- టైపిస్ట్ – 44,
- కాపీయిస్ట్ – 34,
- కంప్యూటర్ ఆపరేటర్ – 31,
- ఎగ్జామినర్ – 27,
- ఆఫీస్ సబార్డినేట్ – 20,
- UD స్టెనోగ్రాఫర్ – 7,
- సెక్షన్ ఆఫీసర్ – 5,
- సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ – 1,
- అసిస్టెంట్ లైబ్రేరియన్ – 1,
- లైబ్రేరియన్ గ్రేడ్-II – 1,
- స్టెనోగ్రాఫర్ – 1 పోస్టులు ఉన్నాయి.
ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు విడిగా విడుదల చేయబడతాయి. పరీక్ష తేదీ, హాల్ టికెట్లు మరియు తదుపరి ప్రక్రియలకు సంబంధించిన సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించబడుతుంది. తాజా అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
ఎలా అప్లై చేయాలంటే..
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ aphc.gov.in సందర్శించాలి.
- హోమ్‌పేజీలో “Recruitments” లేదా “Latest Notifications” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- అక్కడ “AP High Court Recruitment 2026” లింక్‌ను ఎంచుకుని “Apply Online” పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత మీ పేరు, మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోండి.
- లాగిన్ అయిన తర్వాత, దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, కేటగిరీకి సంబంధించిన సమాచారాన్ని జాగ్రత్తగా ఎంటర్ చేయాలి.
- ఆపై మీ ఫోటో, సంతకం, అవసరమైన సర్టిఫికేట్‌లను సూచించిన ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయండి.
- అప్లికేషన్ ఫీజు వర్తిస్తే, ఆన్‌లైన్ మోడ్ ద్వారా చెల్లింపు చేయండి.
- చివరగా, ఫారమ్‌ను సబ్మిట్ చేసి, కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.
