Wedding in the rain : వర్షం ఆ జంట పెళ్లిని ఆపలేకపోయింది .. వర్షంలో పెళ్లి వీడియో వైరల్

వేసవికాలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తోంది. పెళ్లి టైంలో వాన దంచి కొడితే చాలా ఇబ్బంది. ఓవైపు వర్షం కురుస్తోంది.. మరోవైపు ముహూర్త సమయం దగ్గర పడుతోంది. అయినా ఓ జంట వర్షంలో ఎలా పెళ్లి చేసుకున్నారో చూడండి.

Wedding in the rain :  ఓవైపు పెళ్లి ముహుర్తాలు.. అన్ సీజన్‌లో భారీ వర్షాలు. పెళ్లికోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న వారి పరిస్థితి ఎలా ఉంటుంది? భారీ ఏర్పాట్ల మధ్య ఓ పెళ్లి వేడుక మొదలైంది. ఇక వాన దంచి కొట్టింది. ఆ తరువాత ఏమైందో? చదవండి.

Salman Khan : తండ్రి కావాలనుకుంటున్నా.. పెళ్లి పై సల్మాన్ కామెంట్స్..

పెళ్లి వేడుక జరపడం అంటే ఆషామాషీ కాదు. కొన్ని నెలల ముందు నుంచి ఈ వేడుకకు సంబంధించి ఏర్పాట్లు మొదలు పెడతారు. ఎంతో ఆర్భాటంగా ఏర్పాట్లు చేసుకునే వారు కూడా ఉంటారు. ఇక అనుకున్న తరుణం వచ్చి ఓవైపు పెళ్లి వేడుక జరుగుతుంటే భారీగా వర్షం పడుతుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? సరిగ్గా ఓ జంట పెళ్లి విషయంలో ఇలాగే జరిగింది. వివాహ వేడుక జరగడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అంతలోనే వర్షం మొదలైంది. ఇక కరెంట్ కూడా పోయింది. అటువంటి పరిస్థితుల్లో పెళ్లివారు అయోమయంలో పడతారు.

 

కానీ ఈ జంట మాత్రం వర్షంలోనే వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. ఓవైపు వేదికపై వర్షంలో తడుస్తూనే కళాకారులు డ్యాన్స్ చేస్తున్నారు. పెళ్లి వేడుకగా నిరాటంకంగా కొనసాగిపోయింది. ఆ జంట పెళ్లిని వాన ఆపలేకపోయింది. అతిథులకు కూడా కొత్త అనుభూతిని ఇచ్చింది. @anchor_jk అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Bihar CM Nitish Kumar : సీఎం సార్..నేను చనిపోలేదు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నా : నితీశ్ కుమార్‌కు లేఖ

మీ ప్రేమ చాలా గొప్పది అందుకే మీ పెళ్లిని వర్షం ఆపలేకపోయింది అని కొందరు. మీ ఇద్దరికి ప్రకృతి ఆశీర్వాదం పంపింది అని మరికొందరు కామెంట్లు పెట్టారు. వానపాటలు స్క్రీన్ పై చాలా చూసాం. ఇప్పుడు వాన పెళ్లి వీడియో వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు