Marriages: మోగనున్న పెళ్లి బాజాలు.. మే, జూన్ నెలల్లో ముహూర్తాలు

జూన్ 14వ తేదీ తరువాత మళ్లీ ఆగస్టు 18వ తేదీ వరకు శుక్ర మూఢమి కారణంగా పెళ్లిళ్లకు శుభముహూర్తాలు లేవని పండితులు పేర్కొంటున్నారు.

Marriages: మోగనున్న పెళ్లి బాజాలు.. మే, జూన్ నెలల్లో ముహూర్తాలు

Marriage

Marriages: వేసవి కాలం వచ్చేసింది. పెళ్లి సందడి మొదలైంది. ప్రతీయేటా మే, జూన్ నెలల్లో పెళ్లి బాజాల మోతలతో పల్లెలు, పట్టణాల్లో సందడి వాతావరణం ఉంటుంది. ఈ ఏడాదికూడా మే, జూన్ నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో రెండు నెలలు 20కిపైగా రంగాలకు చెందిన వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలగనుంది.

Karnataka Election 2023: కన్నడ ప్రజలపై బీజేపీ హామీల జల్లు.. ఎన్నికల మేనిఫెస్టో విడుదల

జూన్ 14వ తేదీ తరువాత మళ్లీ ఆగస్టు 18వ తేదీ వరకు శుక్ర మూఢమి కారణంగా పెళ్లిళ్లకు శుభముహూర్తాలు లేవని పండితులు పేర్కొంటున్నారు. దీంతో మే నెలలో మొదటి వారం నుంచి జూన్ 14వ తేదీ వరకు శుభ ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు భారీ సంఖ్యలో జరిగే అవకాశాలు ఉన్నాయి.

AP Politics: సైలెంట్ అయ్యారు..! చంద్రబాబు, పవన్ భేటీ.. ఏపీ బీజేపీలో మారుతున్న సమీకరణాలు..

మే నెలలో 3, 4, 5, 6, 7, 10, 11, 12, 13, 14, 20, 21, 26, 27, 31 తేదీల్లో.. అదేవిధంగా జూన్ నెలలో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 14 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు పేర్కొంటున్నారు. ఈ వేసవిలో పెళ్లి చేసుకోవాలనుకునేవారు జూన్ 14 వరకు పెళ్లికి సిద్ధంకాకపోతే.. మళ్లీ ఆగస్టు 18వ తేదీ వరకు వేచి ఉండాల్సిందేనని పురోహితులు చెబుతున్నారు.

Chandrababu Naidu: రజనీకాంత్‌పై వైసీపీ నేతల విమర్శలకు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..

మే నెల మొత్తం, జూన్ 14వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. దీంతో పెళ్లి మండపాలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. మే నెలలో పెళ్లిళ్లు ఉన్నవారు నెలరోజుల ముందుగానే మండపాలను బుక్ చేసుకున్నట్లు మండప నిర్వాహకులు పేర్కొంటున్నారు.